మహారాష్ట్రలో గెలుపు దిశగా ఎన్.డి.ఏ కూటమి. మరాఠా ప్రజలు మహాయుతి పార్టీల వైపే మొగ్గు చూపారు. ఎగ్జిట్ పోల్స్ కూడా నిజం అవుతున్నాయి. కౌంటింగ్ ప్రారంభం అయిన సమయం నుంచి మహాయుతి కూటమి ఆధిక్యత కొనసాగుతోంది.

ఇప్పటికే 150 సీట్లలో ఆధిక్యతతో బీజేపీ కూటమి అధికారం ఖాయం చేసుకుంది. అంచనాలకు భిన్నంగా కాంగ్రెస్ కూటమి ఆధిక్యత ఉంటుందని భావించిన ప్రాంతాల్లోనూ మహాయుతి ఆధిక్యాన్ని కనబరిచింది. మహారాష్ట్రలో మరోసారి బీజేపీ కూటమి అధికారంలోకి రానుంది.
మొత్తం 288అసెంబ్లీ స్థానాలు ఉన్న అసెంబ్లీలో మేజిక్ ఫిగర్ 145 గా ఉంది. కాగా, మహుయుతి కూటమి ఇప్పటికే 190 స్థానాల్లో ఆధిక్యత కొనసాగుతోంది. కాంగ్రెస్ కూటమి 85 స్థానాలతో వెనుకంజలో ఉంది. మరాఠాలో తొలి నుంచి పక్కా వ్యూహాత్మకంగా బీజేపీ అడుగులు వేసింది. సామాజిక సమీకరణాలు – స్థానిక అంశాలకు ప్రాధాన్యత ఇచ్చింది. ఇక, మరో ఏడు చోట్ల ఇతరులు ఆధిక్యతలో ఉన్నారు.