Saturday, November 21, 2026
Google search engine
Homeతెలంగాణమహేశ్వరం గ్రామంలో ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకం ధ్రువీకరణ పత్రాల నమోదు

మహేశ్వరం గ్రామంలో ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకం ధ్రువీకరణ పత్రాల నమోదు

కందుకూరు

మహేశ్వరం గ్రామంలో శుక్రవారం ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకం కింద అర్హులైన లబ్ధిదారులకు కందుకూరు రెవెన్యూ డివిజనల్ అధికారి ఎన్.జగదీశ్వర్ రెడ్డి జీవిత బీమా ధ్రువీకరణ పత్రాల నమోదులో పాల్గొన్నారు.ఈ సందర్భంగా ఆర్డీవో మాట్లాడుతూ, రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకం ద్వారా అర్హులైన ప్రతి కుటుంబానికి ఆర్థిక భద్రత, భరోసా కల్పించడమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని తెలిపారు.కుటుంబ పెద్దకు అనుకోని ప్రమాదం లేదా మరణం సంభవించినప్పుడు ఆ కుటుంబం ఆర్థికంగా ఇబ్బందులు పడకుండా బీమా పథకం అండగా నిలుస్తుందని పేర్కొన్నారు. అర్హులైన ప్రతి ఒక్కరూ ప్రభుత్వ సంక్షేమ పథకాలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.ఈ కార్యక్రమంలో తహసీల్దార్ చిన్నప్పలనాయుడు , ఎంపీడీవో శ్రీమతి శారదమ్మ, మార్కెట్ కమిటీ చైర్మన్ కృష్ణ నాయక్, మహేశ్వరం గ్రామ సర్పంచ్ మునగపాటి నవీన్, ఉపసర్పంచ్ రమేష్, ఇతర ప్రజాప్రతినిధులు, రెవెన్యూ సిబ్బంది మరియు గ్రామ పంచాయతీ సిబ్బంది పాల్గొన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments