ఫ్రీ ఓల్డ్ ఏజ్ హోమ్ లో ఘనంగా కార్యక్రమం..
ఆయన కుమారుడు శివ ప్రకాష్ ఆధ్వర్యంలో కార్యక్రమం..
తెలంగాణ మాజీ స్పీకర్ మధుసూధనాచారి జన్మదిన వేడుకలు సోమవారం రోజు ఫ్రీ ఓల్డ్ ఏజ్ హోమ్, వనస్థలిపురం నందు వృద్ధుల సమక్షంలో, వారి కుమారుడు శివ ప్రకాష్ ఆధ్వర్యంలో ఘనంగా జరిగినవి. ఈ సందర్భముగా వారు ఓల్డ్ ఏజ్ హోమ్ నందలి వృద్ధులకు, రైస్ బాగ్స్, ఫ్రూట్స్, బ్రెడ్స్, దుప్పట్లు అందజేసినారు. ఫ్రీ ఓల్డ్ ఏజ్ హోమ్ మైంటెనెన్సు కొరకు తమ వంతు సహాయ సహకారములు అందించగలనని, ఆశ్రమము నిర్వాహకులు పెద్ది శంకర్ కీ తెలియజేసినారు.


