- *ఎల్బీనగర్ డిప్యూటీ కమిషనర్ కార్యాలయం వద్ద బీజేపీ ‘వంటా-వార్పు’ నిరసన
- *అక్రమ నిర్మాణాల తొలగింపునకు అధికారుల హామీ.. స్పందించిన యంత్రాంగం
హైదరాబాద్:
బి.ఎన్.రెడ్డి నగర్ డివిజన్ పరిధిలోని మారుతీనగర్, ఆఫీసర్స్ కాలనీలకు చెందిన ఉద్యానవన (పార్కు) స్థలాన్ని ఆక్రమించి అక్రమంగా చేపడుతున్న భవన నిర్మాణాన్ని తక్షణమే నిలిపివేసి, ఆ స్థలాన్ని పరిరక్షించాలని డిమాండ్ చేస్తూ భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో వినూత్న నిరసన చేపట్టారు. సోమవారం ప్రజావాణి కార్యక్రమాన్ని పురస్కరించుకుని ఎల్బీనగర్ ఉప కమిషనర్ (డిప్యూటీ కమిషనర్) కార్యాలయం ఎదుట “వంటా-వార్పు” నిర్వహించారు.
ఈ నిరసన కార్యక్రమానికి ఎల్బీనగర్ నియోజకవర్గ బీజేపీ ఇన్ఛార్జ్ సామ రంగారెడ్డి, బి.ఎన్.రెడ్డి నగర్ మాజీ కార్పొరేటర్ మొద్దు లచ్చిరెడ్డి నాయకత్వం వహించారు.
*అధికారుల నిర్లక్ష్యంపై ఆగ్రహం:
ఈ సందర్భంగా సామ రంగారెడ్డి, మొద్దు లచ్చిరెడ్డి మాట్లాడుతూ… మారుతీనగర్, ఆఫీసర్స్ కాలనీవాసులకు ఎంతో ఉపయోగకరంగా ఉండే పార్కు స్థలాన్ని కొంతమంది అక్రమార్కులు ఆక్రమించి భవన నిర్మాణాలు చేపడుతున్నారని మండిపడ్డారు. ఈ అక్రమ నిర్మాణాలపై కాలనీవాసులు, తమ పార్టీ నాయకులు పలుమార్లు మున్సిపల్ అధికారుల దృష్టికి తీసుకెళ్లినా ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం శోచనీయమన్నారు. అధికారుల అలసత్వం వల్లే కబ్జాదారులు రెచ్చిపోతున్నారని విమర్శించారు.

*తక్షణ చర్యలకు మున్సిపల్ అధికారుల హామీ
బీజేపీ నాయకులు చేపట్టిన వినూత్న నిరసనతో మున్సిపల్ యంత్రాంగం దిగివచ్చింది. నిరసన స్థలానికి చేరుకున్న అధికారులు నాయకులతో చర్చలు జరిపారు. పార్కు స్థలాన్ని పూర్తిస్థాయిలో పరిరక్షిస్తామని, అక్రమంగా భవన నిర్మాణం చేపట్టిన వారిపై చట్టరీత్యా కఠిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. అనంతరం వెంటనే జేసీబీ యంత్రాల సహాయంతో పార్కు స్థలంలో పేరుకుపోయిన వ్యర్థాలను తొలగించి శుభ్రం చేసే పనులను ప్రారంభించారు.
*నాయకులకు కాలనీవాసుల కృతజ్ఞతలు:
కాలనీవాసుల సంక్షేమం, ప్రజా ప్రయోజనాల కోసం నిరంతరం పోరాడుతూ పార్కు స్థలాన్ని కాపాడేందుకు కృషి చేసిన సామ రంగారెడ్డి, మొద్దు లచ్చిరెడ్డిలతో పాటు బీజేపీ నాయకులకు మారుతీనగర్, ఆఫీసర్స్ కాలనీ సంక్షేమ సంఘాల ప్రతినిధులు, కాలనీవాసులు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.
*నిరసనలో పాల్గొన్న ముఖ్య నాయకులు
ఈ కార్యక్రమంలో గడ్డిఅన్నారం మాజీ కార్పొరేటర్ బద్దం ప్రేమ్ మహేశ్వర్ రెడ్డి, బి.ఎన్.రెడ్డి నగర్ డివిజన్ అధ్యక్షుడు విష్ణువర్ధన్ రావు, హస్తినాపురం అధ్యక్షుడు మల్లేష్ గౌడ్, రంగారెడ్డి జిల్లా కౌన్సిల్ సభ్యుడు శ్రీధర్ రావు, సీనియర్ నాయకులు అంజన్ కుమార్ గౌడ్, విజయ్ కుమార్, నూతి శ్రీనివాస్, డివిజన్ ప్రధాన కార్యదర్శులు ప్రేమ్ నాథ్, విష్ణువర్ధన్ రెడ్డి, బీసీ మోర్చా అధ్యక్షుడు మహేష్ గౌడ్, బీజేవైఎం రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు భార్గవ్ తేజ, మహిళా నాయకురాలు కవితా రెడ్డి, నాయకులు శంకరయ్య గౌడ్, భూపాల్ రెడ్డి, శ్రీనివాస్ రెడ్డి, రవి శంకర్, కృష్ణారెడ్డి, సంగమేశ్వర్, శ్రీనివాసరావు, కిషోర్, విజయ్ కుమార్, నరసింహ, సిద్దేశ్వర్, రఘువీర్, గిరి, దుర్గా, వినోద్ తదితరులు పాల్గొన్నారు.
అలాగే మారుతీనగర్ కాలనీ అధ్యక్షుడు దుర్గాప్రసాద్, ఆఫీసర్స్ కాలనీ అధ్యక్షుడు బాలాజీ, కాలనీ ప్రతినిధులు వెంకట్ రెడ్డి, నాయుడు, శ్రీనివాస్, అనిల్ కుమార్, కాలనీ మహిళా ప్రతినిధులు అరుణ, దుర్గ, స్వాతి, సత్య, ఉమా, శారద, బిందు, సత్యవేణి, మాధవి, భార్గవి, యాదమ్మ, సుచిత్ర, సరిత, ప్రసన్న, అశ్విని, సునీత, శ్రీమాల, మహేశ్వరి, రమ్య, నాగలక్ష్మి తదితరులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.


