Saturday, November 8, 2025
Google search engine
Homeస్పోర్ట్స్మైక్ టైస‌న్ ఔట్‌..

మైక్ టైస‌న్ ఔట్‌..

పంచుల వర్షం కురిపించిన జేక్ పౌల్..

ప్ర‌పంచ మాజీ హెవీ వెయిట్ చాంపియ‌న్ మైక్ టైసన్ ఖంగుతిన్నాడు. ప్ర‌త్య‌ర్థి జేక్ పౌల్ ఇచ్చిన పంచ్‌ల‌కు.. ఐర‌న్ మైక్ ఓడిపోయాడు. టెక్సాస్‌లో జ‌రిగిన బిగ్ బౌట్‌లో.. 58 ఏళ్ల టైస‌న్ త‌న క‌న్నా 37 ఏళ్ల చిన్నోడైన జేక్ చేతిలో ప‌రాజ‌యాన్ని చ‌విచూశాడు. ఓ ద‌శ‌లో బాక్సింగ్ ప్ర‌పంచాన్ని త‌న వైపు తిప్పుకున్న టైస‌న్‌.. ఈ ఫైట్ కోసం చాలా ప్రిపేర‌య్యాడు. కానీ జేక్ విసిరిన పంచ్‌ల‌కు బ‌ల‌య్యాడు. టైస‌న్‌లో వేగం త‌గ్గిన‌ట్లు బాక్సింగ్ సీనియ‌ర్లు అంచ‌నా వేశారు. అత‌ని కాళ్ల‌లో వేగం త‌గ్గిన‌ట్లు మ్యాచ్ ద్వారా అంచ‌నా వేశారు. పంచ్‌లో కూడా ప‌వ‌ర్ పడిపోయిన‌ట్లు భావించారు.

మొత్తం 8 రౌండ్ల మ్యాచ్‌లో టైస‌న్ పెద్ద‌గా ప‌ర్పార్మ్ చేయ‌లేక‌పోయాడు. ప్ర‌తి రౌండ్ నిమిషాల పాటు సాగింది. జేక్ పౌల్ పంచ్‌ల‌కు టైస‌న్ చాలా సార్లు దొరికిపోయాడు. గ‌ట్టిగా దెబ్బ‌లు త‌గులుతున్నా.. వాటి త‌ట్టుకుని టైస‌న్ ఎదురుదాడికి ప్ర‌య‌త్నించాడు. ఏడ‌వ రౌండ్‌లో టైస‌న్ కుడివైపు జేక్ ప‌వ‌ర్‌ఫుల్ పంచ్ ఇచ్చాడు. 2005లో ప్రొఫెష‌న‌ల్ బాక్సింగ్ నుంచి టైస‌న్ రిటైర్ అయిన విష‌యం తెలిసిందే. రింగ్‌లో అత‌ను ఇప్ప‌టి వ‌ర‌కు కేవ‌లం ఆరుసార్లు మాత్ర‌మే ఓడాడు. వ‌య‌సుకు త‌గ్గ ఫైట్ కాక‌పోయినా.. టైస‌న్ మాత్రం త‌న‌లో దాగిన ఐర‌న్ గుండెను ప్ర‌ద‌ర్శించాడు. 8వ రౌండ్ చివ‌ర‌లో టైస‌న్ ముందు త‌ల‌వంచాడు పౌల్‌. అత‌నికి గ్లౌజ్‌లు ఇచ్చేశాడు టైస‌న్‌. ఏక‌ప‌క్షంగా సాగిన మ్యాచ్‌లో పౌల్ విజేత‌గా నిలిచాడు. ఓ జ‌డ్జి 80-72 స్కోర్ ఇచ్చాడు. మరో ఇద్ద‌రు జ‌డ్జీలు 79-73 స్కోరుతో పౌల్‌కు విక్ట‌రీని అంద‌జేశారు. పౌల్ త‌న కెరీర్ రికార్డును పెంచుకున్నాడు. 12 మ్యాచుల్లో 11 బౌట్‌ల‌ను నెగ్గాడు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments