- యంగ్ లీడర్ మాల్‌రెడ్డి అభిషేక్ రెడ్డి ఆధ్వర్యంలో గురువారం బొంగ్లూర్ క్రాస్ రోడ్స్ సమీపంలో భారీ కార్యక్రమం
- లక్ష్యసాధన దిశగా తొలిప అడుగు
ఇబ్రహీంపట్నం:
ఈనాటి యువతలో ఆత్మవిశ్వాసాన్ని నింపి, వారి భవిష్యత్తుకు బలమైన పునాది వేసేందుకు మాల్‌రెడ్డి అభిషేక్ రెడ్డి నేతృత్వంలో సమగ్ర అవగాహన సదస్సు రూపుదిద్దుకుంది. గురువారం ఉదయం 9:00 గంటల నుంచి మధ్యాహ్నం వరకు బొంగ్లూర్ చౌరస్తాలోని ప్రమీద ప్రాంగణంలో “యువ చైతన్య వేదిక” పేరిట ఈ కార్యక్రమం అత్యంత వైభవంగా జరగనుంది. ఇందుకోసం నిర్వాహకులు ఇప్పటికే అన్ని ఏర్పాట్లనూ పూర్తి చేశారు.
*ఒకే వేదికపై పలు కీలక అంశాలు
ఈ కార్యక్రమంలో యువత ఎదుర్కొంటున్న సవాళ్లు, ఆశయాల సాధనకు అవసరమైన మార్గాలపై నిపుణులు విశ్లేషించనున్నారు:
ప్రముఖ స్ఫూర్తిదాత ఆకెళ్ళ రాఘవేంద్ర పాల్గొని, యువతలో లక్ష్య సాధన పట్ల పట్టుదలను పెంపొందించేలా దిశానిర్దేశం చేయనున్నారు.
*ఉపాధి రంగంలో అవకాశాలు: మారుతున్న సాంకేతికతకు అనుగుణంగా ఉద్యోగ ఉపాధి అవకాశాలను ఎలా అందుకోవాలో సమగ్రంగా వివరిస్తారు.
*మత్తు పదార్థాల నిర్మూలన: సమాజాన్ని పట్టిపీడిస్తున్న మత్తు పదార్థాల నియంత్రణ, వాటికి దూరంగా ఉండేందుకు పాటించాల్సిన సూత్రాలపై నిపుణులతో ప్రత్యేక అవగాహన కల్పిస్తారు.
*సామాజిక మాధ్యమాల సమర్థ వినియోగం: సామాజిక మాధ్యమాలను వ్యక్తిగత, వృత్తిపరమైన ఎదుగుదలకు ఏ విధంగా ఉపయోగించుకోవాలో ప్రదర్శన (ప్రజెంటేషన్) ద్వారా చూపిస్తారు.
*వ్యక్తిత్వ వికాసం & కెరీర్ మార్గదర్శకత్వం: యువకులు తమలోని ప్రతిభను గుర్తించి సరైన వైఖరితో కెరీర్‌లో స్థిరపడేందుకు తగిన సూచనలు అందిస్తారు.
*యువతకు పిలుపునిచ్చిన మాల్‌రెడ్డి అభిషేక్ రెడ్డి “నేటి యువతే రేపటి దేశ భవిష్యత్తు. ఆ యువతకు సరైన వేదిక, మార్గదర్శకత్వం అందించడమే మా ముఖ్య ఉద్దేశం. ఈ సువర్ణ అవకాశాన్ని ప్రతి ఒక్కరూ ఉపయోగించుకుని, తమ బంగారు భవిష్యత్తుకు పునాది వేసుకోవాలి.”
*మాల్‌రెడ్డి అభిషేక్ రెడ్డి
ఈ ప్రేరణాత్మక సదస్సుకు యువత పెద్ద సంఖ్యలో తరలివచ్చి విజయవంతం చేయాలని నిర్వాహక వర్గం కోరింది.


