Tuesday, September 29, 2026
Google search engine
Homeతెలంగాణయువత సృజనాత్మకతకు బతుకమ్మ ఛాలెంజ్‌ వేదిక.. ఇన్ఫ్లుయెన్సర్లకు ప్రత్యేక పిలుపు

యువత సృజనాత్మకతకు బతుకమ్మ ఛాలెంజ్‌ వేదిక.. ఇన్ఫ్లుయెన్సర్లకు ప్రత్యేక పిలుపు

యువ ప్రతిభను ప్రోత్సహించడమే లక్ష్యం.. ప్రభుత్వ పథకాలు, తెలంగాణ సంస్కృతిని ప్రజల్లోకి తీసుకెళ్లడంలో ఇన్ఫ్లుయెన్సర్లదే కీలక పాత్ర

హైదరాబాద్:

బతుకమ్మ యంగ్ ఫిలిం మేకర్స్ ఛాలెంజ్‌–2026లో భాగంగా ఇన్ఫ్లుయెన్సర్ల సమావేశం సోమవారం ఎఫ్‌డీసీ కార్యాలయంలో విజయవంతంగా జరిగింది. తెలంగాణ ఫిల్మ్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ (ఎఫ్‌డీసీ) చైర్మన్ దిల్ రాజు, ఎఫ్‌డీసీ మేనేజింగ్ డైరెక్టర్ ఎం. ముకుంద రెడ్డి, ప్రభుత్వ క్రియేటివ్ డైరెక్టర్ కొండా రాజు ఆధ్వర్యంలో, ఇన్ఫ్లుయెన్సర్ జీలా అనిల్ సమన్వయంతో ఈ సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా బతుకమ్మ యంగ్ ఫిలిం మేకర్స్ ఛాలెంజ్‌ లక్ష్యాలు, పోటీ విధివిధానాలు, వివిధ విభాగాలు, పాల్గొనే విధానం తదితర అంశాలను ఇన్ఫ్లుయెన్సర్లకు వివరించారు. తెలంగాణ ప్రభుత్వం యువ కళాకారులు, కంటెంట్ క్రియేటర్లు, ఫిల్మ్ మేకర్లను ప్రోత్సహించే ఉద్దేశంతో నిర్వహిస్తున్న ఈ కార్యక్రమంలో ఇన్ఫ్లుయెన్సర్లు విస్తృతంగా భాగస్వాములు కావాలని సూచించారు.

తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలు, బతుకమ్మ పండుగ విశిష్టతతో పాటు రాష్ట్ర ప్రభుత్వ సంక్షేమ పథకాలు, ప్రజా పాలనకు సంబంధించిన సమాచారాన్ని సృజనాత్మక డిజిటల్ కంటెంట్ ద్వారా ప్రజల్లోకి తీసుకెళ్లడంలో ఇన్ఫ్లుయెన్సర్లు కీలక పాత్ర పోషించగలరని సమావేశంలో పేర్కొన్నారు.

ఇన్ఫ్లుయెన్సర్ల విభాగంలో తెలంగాణ ప్రభుత్వ పథకాలు, ప్రజా పాలనపై రీల్స్, డిజిటల్ స్టోరీటెల్లింగ్‌ ద్వారా కంటెంట్ రూపొందించేందుకు అవకాశం కల్పించారు. యువ ఫిల్మ్ మేకర్లు, ఇన్ఫ్లుయెన్సర్లు, కంటెంట్ క్రియేటర్లు పెద్ద సంఖ్యలో పాల్గొని ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని నిర్వాహకులు కోరారు. ఈ కార్యక్రమంలో ఎఫ్‌డీసీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ కిషోర్ బాబు, బీసీ స్టడీ సర్కిల్ డైరెక్టర్ డా. మామిడి హరికృష్ణ, సినీ నటుడు రచ్చ రవి, అనిల్, అభినవ్ తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments