స్థానిక సంస్థల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల సాధన కోసం రేపు నిర్వహించనున్న రాష్ట్ర బంద్ కు మద్దతుగా, హైదరాబాద్‌లో బీసీ ఐకాస ఆధ్వర్యంలో ర్యాలీ జరిగింది.ఈ ర్యాలీ విద్యార్థులతో కలిసి నిర్వహించబడింది. ఇందులో రాజ్యసభ సభ్యుడు, బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్.కృష్ణయ్య పాల్గొన్నారు. ఆయన ప్రకారం, బంద్‌కు అన్ని రాజకీయ పార్టీలు మద్దతు ప్రకటించాయాని తెలిపాడు.
బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించే వరకు మా పోరాటం ఆగదు. అంతేకాదు, విద్యాసంస్థలు, బస్సులు, వ్యాపార సముదాయాలను స్వచ్ఛందంగా బంద్ పాటించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. బంద్ శాంతియుతంగా నిర్వహించాలని అయన తెలిపారు.


