శేరిలింగంపల్లి:
మియాపూర్ పోలీసుల కథనం ప్రకారం మున్సిపల్ లో పారిశుద్ధ్య కార్మికురాలు రోడ్డు శుభ్రం చేస్తున్న సమయంలో ఉదయం సుమారు 5 గంటల సమయంలో మియాపూర్ చౌరస్తాకు దగ్గరలో గల ఆర్బీఆర్ కాంప్లెక్స్ వద్ద గల మసీదు సమీపంలో సుమారు 40 – 45 సంవత్సరాల వయస్సు కలిగిన గుర్తుతెలియని ఒక మగ వ్యక్తి నేలపై పడి ఉండటాన్ని గమనించి అతని వద్దకు వెళ్లి చూడగా సదరు వ్యక్తి మరణించి ఉన్నట్లు అనుమానించి మహిళ 100 నంబర్‌కు ఫోన్ చేసి విషయాన్ని పోలీసులకు సమాచారం అందించగా వెంటనే మియాపూర్ పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని పరిసరాలు పరిశీలించి మృతదేహాన్ని గాంధీ ఆసుపత్రి కి తరలించి తదుపరి విచారణ జరుపుతున్నామని చెబుతూ మృతుడి వివరాలు తెలిసినవారు మియపూర్ పోలీస్టేషన్‌కి గాని ఇన్స్పెక్టర్ 8712663170 కి గాని సమాచారం ఇవ్వగలరని పోలీసులు తలిపారు


