Tuesday, August 4, 2026
Google search engine
Homeతెలంగాణ*రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన కానిస్టేబుల్ కుటుంబానికి రూ. కోటి బీమా చెక్కు అందజేత

*రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన కానిస్టేబుల్ కుటుంబానికి రూ. కోటి బీమా చెక్కు అందజేత

*డీజీపీ సి.వి. ఆనంద్ ఉదారత: విధి నిర్వహణలో ప్రాణాలు కోల్పోయిన వీరుడి కుటుంబానికి అండ

*హైదరాబాద్

విధి నిర్వహణలో రోడ్డు ప్రమాదానికి గురై వీరమరణం పొందిన మల్కాజిగిరి కమిషనరేట్ ఏఆర్ కానిస్టేబుల్ వి. చరణ్‌కుమార్ (పీసీ-8968) కుటుంబానికి ప్రభుత్వం అండగా నిలిచింది. బాధిత కుటుంబానికి రూ. 1 కోట్ల బీమా చెక్కును రాష్ట్ర పోలీసు బాస్ డీజీపీ సి.వి. ఆనంద్ అందజేశారు.

*ప్రమాదం జరిగిందిలా..
మల్కాజిగిరి కమిషనరేట్‌కు చెందిన 2018 బ్యాచ్ కానిస్టేబుల్ చరణ్‌కుమార్ ప్రస్తుతం ఈగల్ ఫోర్స్‌లో డిప్యూటేషన్‌పై విధులు నిర్వర్తిస్తున్నారు.

  • 2025 సెప్టెంబర్ 22-23 అర్ధరాత్రి విధులు ముగించుకుని తిరిగి వస్తుండగా, మహారాష్ట్రలోని దేవార్కర్ గ్రామం సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది.
  • ఈ ప్రమాదంలో ఆయనకు కుడికాలు, తలకు తీవ్ర గాయాలయ్యాయి.
  • మెరుగైన వైద్యం కోసం కుటుంబ సభ్యులు ఆయన్ను హైదరాబాద్‌లోని యశోద ఆసుపత్రికి తరలించారు.
  • వైద్యుల పర్యవేక్షణలో ప్లాస్టిక్ సర్జరీ అనంతరం, ఆరోగ్యం కుదుటపడటంతో 2025 అక్టోబర్ 28న ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు.

*విషాదాంతం..
ఆసుపత్రి నుంచి ఇంటికి చేరుకున్న కొద్దిసేపటికే చరణ్‌కుమార్ అకస్మాత్తుగా కుప్పకూలి అపస్మారక స్థితికి చేరుకున్నారు. వెంటనే అప్రమత్తమైన కుటుంబ సభ్యులు ఆయన్ను మళ్లీ యశోద ఆసుపత్రికి తరలించగా, అప్పటికే ఆయన మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు.

*అధికారుల ప్రత్యేక చొరవ
కానిస్టేబుల్ అకాల మరణంతో రోడ్డున పడిన కుటుంబానికి ఆర్థిక భరోసా కల్పించేందుకు ఉన్నతాధికారులు ప్రత్యేక శ్రద్ధ వహించారు.

  • ఈగల్ ఫోర్స్ డైరెక్టర్ సందీప్ షాండిల్య, ఎస్పీ రఘువీర్, అదనపు ఎస్పీ కృష్ణమూర్తి తదితరులు ఎస్‌బీఐ (స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా) అధికారులతో సమన్వయం చేసుకున్నారు.
  • ఎలాంటి జాప్యం జరగకుండా అన్ని లాంఛనాలను పూర్తి చేసి బీమా క్లెయిమ్‌ను త్వరితగతిన సాధించారు.
    ఈ సందర్భంగా కానిస్టేబుల్ కుటుంబ సభ్యులను పరామర్శించిన డీజీపీ సి.వి. ఆనంద్.. వారి కుటుంబానికి పోలీసు శాఖ తరఫున ఎల్లప్పుడూ అండగా ఉంటామని భరోసా ఇచ్చి, ప్రగాఢ సానుభూతిని తెలిపారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments