Home తెలంగాణ విజయవంతంగా భారతీయ మజ్ఞూర్ సంఘ్ బిఎంఎస్ 158వ అఖిల భారత జాతీయ కార్యవర్గ సమావేశం..

విజయవంతంగా భారతీయ మజ్ఞూర్ సంఘ్ బిఎంఎస్ 158వ అఖిల భారత జాతీయ కార్యవర్గ సమావేశం..

0
విజయవంతంగా భారతీయ మజ్ఞూర్ సంఘ్ బిఎంఎస్ 158వ అఖిల భారత జాతీయ కార్యవర్గ సమావేశం..
The event will be held in Guwahati, Assam on February 10-12

అస్సాంలోని గౌహతిలో ఫిబ్రవరి 10-12 తేదీలలో కార్యక్రమం..

అస్సాంలోని గౌహతిలో 2025 ఫిబ్రవరి 10-12 తేదీలలో భారతీయ మజ్ఞూర్ సంఘ్ బిఎంఎస్ 158వ అఖిల భారత జాతీయ కార్యవర్గ సమావేశం జరిగింది.. ఈ సమావేశంలో కొన్ని తీర్మానాలను ఆమోదించి అమలుపరచుటకు.. ఫిబ్రవరి 1, 2025 నాడు భారత ప్రభుత్వం సమర్పించిన బడ్జెట్లో ఆదాయపు పన్ను పరిమితిని పెంచడం ద్వారా ఉద్యోగులకు ఉపశమనం లభించింది. సీనియర్ సిటిజనులకు కూడా టీడీఎస్ ద్వారా ఉపశమనం కల్పించి సత్కరించారు. క్యాన్సర్ వ్యాధులకు సంబంధించిన మందులపై దిగుమతి సుంకాన్ని తగ్గించి అనేకమంది వ్యాధిగ్రస్తులకు ఉపశమనాన్ని అందించారు. అయితే ఈ వర్కింగ్ కమిటీ స్వాగతిస్తున్న ఇన్ఫ్రాస్ట్రక్చర్ ద్వారా ఉపాధి కల్పన దిశగా ఒక ముఖ్యమైన అడుగు వేశారు. కానీ 6, జనవరి 2025న జరిగిన ప్రీ బడ్జెట్ సమావేశంలో కేంద్ర ఆర్థిక మంత్రికి భారతీయ మద్దూర్ సంఘ్ ఇచ్చిన సూచనలను ఆశించినంత విధంగా పూర్తిగా అమలు చేయలేదు.

ప్రస్తుత బడ్జెట్ నుండి 75 లక్షల మందికి పైగా ఈపీఎఫ్ – 95 పెన్షనర్లకు ఎలాంటి ఉపశమనం లభించలేదని.. ఈ ద్రవ్యోల్బణ యుగంలో 1000/- రూపాయలతో జీవించడం కుదరనందున వారిలో తీవ్ర నిరాశ ఉందని వర్కింగ్ కమిటీ భావిస్తుంది. అంగన్వాడి, ఆశ, మధ్యాహ్నం భోజనం కార్మికులు, వ్యవసాయ కార్మికులు, మైనింగ్ కార్మికులు వంటి అసంఘటిత కార్మికులు కూడా నిర్లక్ష్యానికి గురయ్యారు.
ఇక బడ్జెట్లో 2030 నాటికి అసెట్ మానిటైజేషన్ ద్వారా 10 లక్షల కోట్ల సమీకరించాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. అదే సమయంలో లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ లో 100శాతం విదేశీ పెట్టుబడులను అనుమతించడం ద్వారా ప్రభుత్వ ఆస్తుల అమ్మకానికి మార్గం తెరిచి, భారతీయ మజ్జూర్ సంఘ్ కమిటీ ఇచ్చిన సూచనలను పక్కకు నెట్టింది.

ఈ సందర్భంగా భారతీయ మజ్జూర్ సంఘ్ కొన్ని డిమాండ్లు చేసింది..

ఈపీఎఫ్ – 95 యొక్క కనీస పెన్షన్ 1000/- రూపాయల నుండి 5000/- రూపాయలకు వెంటనే పెంచాలి. చివరకు జీతంలో 50శాతం + డీఏ రిలీఫ్ పెన్షన్ ను చెల్లించాలి. ఈపీఎఫ్ 4 2 15,000/-30,000/- 2. ఈ.ఎస్.ఐ. జీతం పరిమితిని 21,000/- నుంచి 42,000/- పెంచాలి. ప్రభుత్వ ఆస్తుల విక్రయాలపై తక్షణమే నిషేధం విధించాలి. బీమా/ ఆర్థిక రంగంలో 100 శాతం విదేశీ పెట్టుబడులను నిషేధించాలి. స్కీమ్ వర్కర్లకు ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా జీతం, సామాజిక భద్రత కల్పించాలి. అసంఘటిత కార్మిక రంగానికి బోర్డ్ లను ఏర్పాటు చేసి వాటికి తగినన నిధులను కేటాయించాలి.

సమస్యల పరిష్కారం కోసం భారతీయ మజూర్ సంఘ్ తెలంగాణ రాష్ట్ర కార్యవర్గం మార్చి నుండి పై విషయాల గురించి విస్తృతంగా కార్మికులకు అవగాహన కల్పించాలని బీ.ఎం.ఎస్. కార్యకర్తలకు విజ్ఞప్తి చేస్తున్నారు. కార్మికుల తీవ్ర సమస్యల పరిష్కారం కోసం తక్షణమే బడ్జెట్ లో సవరణలు చేయాలని, లేని పక్షంలో 2025 మార్చి 18 వ తారీకున తెలంగాణ రాష్ట్రంలోని జిల్లాస్థాయిలో నిరసన కార్యక్రమాలను నిర్వహించి కలెక్టర్, సంబదిత అధికారుల ద్వారా ప్రధానమంత్రికి వినతిపత్రం సమర్పించాలని జాతీయ వర్కింగ్ కమిటీ నిర్ణయం తీసుకుందని భారతీయ మజ్దూర్ సంఘ్ పెద్దపల్లి జిల్లా అధ్యక్షులు బూర్ల లక్ష్మి నారాయణ, జిల్లా ప్రధాన కార్యదర్శి కంది శ్రీనివాస్ గౌడ్లు, కృష్ణలు తెలియజేశారు.. ఈ సందర్భంగా పెద్దపల్లి జిల్లా కలెక్టర్ ను కలిసి వినతిపత్రం అందజేశారు..

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here