Home క్రైమ్ స్పెషల్ వివాహేతర సంబంధంపై అనుమానం..

వివాహేతర సంబంధంపై అనుమానం..

0
వివాహేతర సంబంధంపై అనుమానం..
Wife killed an employee of her husband's company.

భర్త కంపెనీలో పని చేసే ఉద్యోగిని హత్య చేసిన భార్య..

భర్త కంపెనీలో పని చేసే ఉద్యోగినితో అతడికి వివాహేతర సంబంధం ఉందని భార్య అనుమానించింది. దీంతో ఒకరి ఇంట్లో ఆమెను కలిసింది. ఈ సందర్భంగా వారిద్దరి మధ్య జరిగిన వాగ్వాదం ఘర్షణకు దారి తీసింది. ఈ నేపథ్యంలో ఆ ఉద్యోగిని కత్తితో పొడిచి చంపింది. అడ్డుకునేందుకు ప్రయత్నించిన మరో మహిళ ఈ సంఘటనలో గాయపడింది. మధ్యప్రదేశ్‌లోని జబల్‌పూర్‌లో ఈ సంఘటన జరిగింది. బ్రజేష్ మిశ్రాకు చెందిన నిర్మాణ కంపెనీలో 33 ఏళ్ల అనికా మిశ్రా ఉద్యోగిగా పని చేస్తున్నది. అయితే ఆ మహిళ, బ్రజేష్‌ మధ్య వివాహేతర సంబంధం ఉందని అతడి భార్య అయిన 35 ఏళ్ల శిఖా మిశ్రా అనుమానించింది.

కాగా, బుధవారం అనికాను శిఖా సంప్రదించింది. ప్రొఫెసర్ కాలనీలోని సోనమ్ నివాసంలో ఆమెను కలిసింది. ఈ సందర్భంగా వారిద్దరి మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. ఇది ఘర్షణకు దారితీయడంతో అనికాపై కత్తితో శిఖా దాడి చేసి పొడిచింది. తీవ్రంగా గాయపడిన ఆమె మరణించింది. అడ్డుకునేందుకు ప్రయత్నించిన సోనమ్ కూడా ఈ సంఘటనలో గాయపడింది. హాస్పిటల్‌లో ఆమె చికిత్స పొందుతున్నది.

మరోవైపు ఈ విషయం తెలిసిన పోలీసులు కేసు నమోదు చేశారు. అనికాపై కత్తితో దాడి తర్వాత అక్కడి నుంచి పారిపోయిన నిందితురాలు శిఖా మిశ్రాను గురువారం సాత్నా రైల్వే స్టేషన్‌లో అరెస్టు చేసినట్లు ఏఎస్పీ తెలిపారు. ఈ సంఘటనపై దర్యాప్తు చేస్తున్నట్లు వెల్లడించారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here