Home క్రైమ్ స్పెషల్ శబరిమలైలో రోడ్డు ప్రమాదం..

శబరిమలైలో రోడ్డు ప్రమాదం..

0
శబరిమలైలో రోడ్డు ప్రమాదం..
Two city dwellers died Two others were seriously injured

ఇద్దరు నగరవాసులు మృతి
మరో ఇద్దరికి తీవ్రంగా గాయాలు

మైలార్‌దేవ్‌పల్లి డివిజన్‌ నుంచి శబరిమలై అయ్యప్ప స్వామి దర్శనానికి వెళ్లి వ్యక్తులు రోడ్డు ప్రమాదానికి గురై ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందగా మరో ఇద్దరికి తీవ్ర గాయాలైయ్యాయి. మైలార్‌దేవ్‌పల్లి డివిజన్‌ బాబుల్‌రెడ్డినగర్‌ ప్రాంతానికి చెందిన డాక్టర్‌ పోతన్న(50) , శ్రీరామనగర్‌ ప్రాంతానికి చెందిన సీతారామ్‌నాయక్‌(49)లు ఆర్‌ఎంపీ డాక్టర్లుగా క్లినిక్‌లు నిర్వహిస్తున్నాడు. ఆయన కుమారుడు చరణ్‌, స్నేహితుడు శివకుమార్‌గౌడ్‌లు కలిసి శబరిమలై అయ్యప్ప స్వామి దర్శనానికి ఈ నెల 16వ తేదీన టిఎస్‌07హెచ్‌హెచ్‌6999 నెంబర్‌ గల కారులోబయలుదేరారు.

అయ్యప్ప స్వామిని దర్శనం చేసుకోని అనంతరం బుధవారం ఉదయం నగరానికి బయలుదేరారు. తమిళనాడు దేవాదయపట్టి ప్రధాన రహదారి వద్దకు రాగానే పక్క నుంచి వెళ్తున్న మరో వాహనాన్ని ఢీకొట్టారు. ఈ ప్రమాదంలో కారు పల్టీలు కొట్టి పొదల్లో పడిపోయింది. ఈ ప్రమాదంలో కారు పూర్తిగా నుజ్జునుజ్జు అయింది. ప్రమాదాన్ని గమనించిన స్థానికులు అక్కడి పోలీసులకు సమాచారం అందించడంతో వెంటనే అక్కడకు చేరుకొని పరిశీలించారు. అప్పటికే కారులో ప్రయాణిస్తున్న నలుగురిలో పోతన్న, సీతారామ్‌నాయక్‌లు అక్కడికక్కడే మృతి చెందారు.

మరో ఇద్దరు చేతన్‌, శివకుమార్‌గౌడ్‌లకు తీవ్ర గాయాలైనట్లు గుర్తించి స్థానికంగా ఉన్న మధురైలోని ఆసుపత్రికి చికిత్స నిమిత్తం తరలించారు. చికిత్స పొందుతున్న వారి పరిస్థితి సైతం తీవ్ర విషమంగా ఉందని డాక్టర్లు వెల్లడించినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. మైలార్‌దేవ్‌పల్లి డివిజన్‌ బాబుల్‌రెడ్డినగర్‌, శ్రీరామ్‌నగర్‌ కాలనీకి చెందిన ఇద్దరు వ్యక్తులు మృతి చెందడంతో స్థానికంగా విషాదఛాయలు అలముకున్నాయి. స్థానికులు వారి కుటుంబాల్ని ఓదార్చేందుకు వెళ్లి కన్నీటి పర్యంతమయ్యారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here