సంగారెడ్డి జిల్లా నాయీ బ్రాహ్మణ సేవా సంఘం ఆధ్వర్యంలో బుధవారం వైద్య నారాయణ ధన్వంతరి జయంతి వేడుకలను సంగారెడ్డిలో ఘనంగా నిర్వహించారు. ధన్వంతరి చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా నాయీ బ్రాహ్మణ సేవా సంఘం జిల్లా అధ్యక్షులు మామిళ్ళ నాగభూషణం మాట్లాడుతూ… మొదటి ఆయుర్వేద వైద్యుడు ధన్వంతరి అని వ్యాధుల నివారణకు ధన్వంతరి ఎంతగానో కృషి చేశారని పేర్కొన్నారు. ఆయుర్వేద వైద్యరంగంలో ఆయన చేసిన సేవలు మరువలేనివని తెలిపారు. ఈ కార్యక్రమంలో సంగారెడ్డి జిల్లా నాయి బ్రాహ్మణ సేవా సంఘం ముఖ్య సలహాదారుడు ఎం. సాయినాథ్, సంగారెడ్డి డివిజన్ అధ్యక్షులు చేర్యాల ఆంజనేయులు, ఉపాధ్యక్షులు వీరన్న, కంది మురళి, కోశాధికారి సత్తయ్య, ప్రచార కార్యదర్శి సుభాష్, కంది ఉపాధ్యక్షులు ఆనంద్ తదితరులు పాల్గొన్నారు.


