Wednesday, October 28, 2026
Google search engine
Homeతెలంగాణసాఫ్ట్ వేర్ ఉద్యోగి అదృశ్యం...

సాఫ్ట్ వేర్ ఉద్యోగి అదృశ్యం…

శేరిలింగంపల్లి : సాఫ్ట్ వేర్ ఉద్యోగి అదృశ్యం అయినా సంఘటన మాదాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. ఇన్స్పెక్టర్ కె.వి సుబ్బారావు తెలిపిన వివరాల ప్రకారం ఎడుబిల్లి సంధ్యారాణి, వయస్సు (26) సంవత్సరాలు, తన తమ్ముడు ఎడుబిల్లి రాజేష్, వయస్సు (25) సంవత్సరాలు, మాదాపూర్లోని కాగ్నిజెంట్ కంపెనీలో సాఫ్ట్‌వేర్ ఉద్యోగిగా పనిచేస్తూ నాచారంలో నివసిస్తున్నాడని, అతను కనిపించడం లేదని మంగళవారం ఉదయం మాదాపూర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.
సోమవారం తెల్లవారుజామున సుమారు 02:00 నుండి 02:30 గంటల మధ్య రాజేష్ మాదాపూర్‌లోని అయ్యప్ప సొసైటీలో ఉన్న తన స్నేహితుడి గదికి వెళ్లి మద్యం సేవించినట్లు తెలిసింది. అనంతరం ఉదయం సుమారు 06:30 నుండి 07:00 గంటల మధ్య తన స్నేహితుడితో కలిసి దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జి వద్దకు వెళ్లాడు., ఆ తరువాత అతను కనిపించకుండా పోయినట్లు సమాచారం. అతని స్నేహితులు పరిసర ప్రాంతాల్లో వెతికినప్పటికీ ఆచూకీ లభించలేదు.
కనిపించకుండా పోయిన
ఎడుబిల్లి రాజేష్
(25 )సంవత్సరాలు
ఎత్తు, సుమారు 5 అడుగుల 10 అంగుళాలు,తెలుపు
,ఆకుపచ్చ రంగు టీ-షర్ట్, తెలుపు రంగు ప్యాంట్
తెలుగు, ఇంగ్లీష్ మంచిగా మాట్లాడుతాడాన్నారు.
ఈ మేరకు కేసు నమోదు చేసి, కనిపించకుండా పోయిన వ్యక్తి ఆచూకీ కోసం దర్యాప్తు చేపట్టడం జరిగిందన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments