వెల్లడించిన జిల్లా కలెక్టర్..
బీడేకన్నే గ్రామంలో కృషి సఖి శిక్షణ కార్యక్రమం..
సేంద్రియ పద్ధతిలో పంటల సాగుతోనే భవిష్యత్తుకు భద్రత భద్రత ఉంటుందని ప్రాచీన పంటల సాగు ప్రాముఖ్యతను వివరిస్తూ జిల్లా కలెక్టర్ పి. ప్రావీణ్య అన్నారు.ఝరాసంగం మండలంలోని బిడెకన్నె గ్రామంలో అరణ్య అగ్రికల్చరల్ ఆల్టర్నేటివ్స్–లీడ్ నేచురల్ ఫార్మింగ్ ఇన్స్టిట్యూట్ ల ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న కృషి సఖి శిక్షణ కార్యక్రమం శుక్రవారం ముగిసింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జిల్లా కలెక్టర్ పి. ప్రావీణ్య హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ పర్యావరణానికి అనుకూలంగా, ఆరోగ్యానికి మేలు చేసే పంటల కోసం సేంద్రియ సాగు అత్యంత అవసరం అన్నారు. మన తాతలు సాగు చేసిన సాంప్రదాయ పంటలను తిరిగి అభివృద్ధి చేసేందుకు కృషి సఖి మహిళలు ముందుండాలి అని పేర్కొన్నారు.ఈనెల 27 నుండి 31 వరకు ఐదు రోజులపాటు జరిగిన ఈ శిక్షణలో నారాయణఖేడ్, రాయకోడ్, జహీరాబాద్ డివిజన్లకు చెందిన మొత్తం 15 మండలాల కృషి సఖి మహిళలు శిక్షణలో పాల్గొన్నారు. సేంద్రియ వ్యవసాయ పద్ధతులు, విత్తన పరిరక్షణ, స్థానిక జీవావరణానికి అనుగుణమైన పంటల సాగు వంటి అంశాలపై నిపుణులు కృషి సఖి మహిళలకు అవగాహన కల్పించారు.చివరి రోజున శిక్షణ పూర్తి చేసుకున్న కృషి సఖి మహిళలకు కలెక్టర్ ప్రావీణ్య సర్టిఫికెట్లు అందజేశారు.ఈ కార్యక్రమంలో జిల్లా వ్యవసాయ శాఖాధికారి శివప్రసాద్, సహాయ వ్యవసాయ సంచాలకులు శ్రీదేవి, వ్యవసాయ అధికారి ప్రేమలత, జహీరాబాద్, ఆర్‌డిఓ దేవుజా,సహాయ వ్యవసాయ సంచాలకులు బిక్షపతి, స్థానిక తహసీల్దార్ తిరుమలరావు, ఎంపీడీవో మంజుల, మండల వ్యవసాయ అధికారి వెంకటేశ్, అరణ్య సీఈఓ పద్మ, ఎల్ ఎన్ ఎఫ్ ఐ నోడల్ ఆఫీసర్ స్నేహా, వివిధ అధికారులు, రైతులు, తదితరులు పాల్గొన్నారు.


