పటాన్‌చెరు:
పటాన్‌చెరు నియోజకవర్గంలోని అమీన్‌పూర్ మండలం బీరంగూడ డివిజన్, అమీన్‌పూర్ డివిజన్ పరిధిలో చేపట్టిన పలు అభివృద్ధి పనులకు రాష్ట్ర మంత్రివర్యులు వివేక్ తో కలిసి గౌరవనీయులు ఎమ్మెల్సీ డాక్టర్ చిన్నమైల్ అంజిరెడ్డి శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో జీహెచ్‌ఎంసీ జోనల్ కమిషనర్ , ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా అమీన్‌పూర్ బీజేపీ మండల అధ్యక్షులు శ్రీ ఈర్ల రాజు ముదిరాజ్ ఎమ్మెల్సీ డాక్టర్ చిన్నమైల్ అంజిరెడ్డి కి పుష్పగుచ్ఛం అందించి ఘనంగా స్వాగతం పలికారు. అనంతరం అభివృద్ధి పనుల శంకుస్థాపన కార్యక్రమంలో పాల్గొని, ప్రజలకు అవసరమైన మౌలిక వసతుల కల్పనపై అధికారులతో చర్చించారు.
ఈ సందర్భంగా ఈర్ల రాజు ముదిరాజ్ మాట్లాడుతూ, అమీన్‌పూర్ మండల ప్రజల అభివృద్ధే భారతీయ జనతా పార్టీ ప్రధాన లక్ష్యమని అన్నారు. ప్రజలకు అవసరమైన రహదారులు, డ్రైనేజీ వ్యవస్థ, తాగునీటి సౌకర్యం, పారిశుద్ధ్యం, వీధి దీపాలు వంటి మౌలిక వసతుల అభివృద్ధికి భారతీయ జనతా పార్టీ నిరంతరం కృషి చేస్తోందని తెలిపారు. ప్రజలు ఎదుర్కొంటున్న ప్రతి సమస్యను ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లి, వాటి పరిష్కారం కోసం నిరంతరం పోరాడుతామని చెప్పారు.
అనంతరం జీహెచ్‌ఎంసీ కార్యాలయంలో నిర్వహించిన సమీక్ష సమావేశంలో ఎమ్మెల్సీ డాక్టర్ చిన్నమైల్ అంజిరెడ్డి, రాష్ట్ర మంత్రివర్యులు శ్రీ వినోద్ కుమార్ , జీహెచ్‌ఎంసీ జోనల్ కమిషనర్ తో కలిసి అభివృద్ధి పనుల పురోగతిపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా అమీన్‌పూర్ మండల ప్రజలు ఎదుర్కొంటున్న పలు సమస్యలను ఈర్ల రాజు ముదిరాజ్ అధికారుల దృష్టికి తీసుకువెళ్లి, పెండింగ్‌లో ఉన్న అభివృద్ధి పనులను వేగవంతంగా పూర్తి చేసి ప్రజలకు మెరుగైన సేవలు అందించాలని విజ్ఞప్తి చేశారు.
ప్రజల సహకారంతో అమీన్‌పూర్ మండలాన్ని ఆదర్శ మండలంగా తీర్చిదిద్దేందుకు భారతీయ జనతా పార్టీ కట్టుబడి పనిచేస్తుందని ఈర్ల రాజు ముదిరాజ్ పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో అమీన్‌పూర్ మండల భారతీయ జనతా పార్టీ జిల్లా కౌన్సిల్ సభ్యులు, అంజిరెడ్డి.మండల ఉపాధ్యక్షులు చీమల దారి శ్రీహరి, రాజేందర్ గౌడ్, నాయకులు వడ్డే రమేష్, చిన్న రొయ్యల కృష్ణ ముదిరాజ్, జయ బాలరాజ్, ఈర్ల లిఖిల్ ముదిరాజ్, రామకిషన్. నాయకులు, కార్యకర్తలు, ప్రజాప్రతినిధులు మరియు పార్టీ శ్రేణులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు..



