పిఎసి చైర్మన్, శేరిలింగంపల్లి నియోజకవర్గం ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ…..
శేరిలింగంపల్లి :
హఫీజ్పేట్ డివిజన్ పరిధిలోని ఇంద్రారెడ్డి ఆల్విన్ కాలనీ లో నూతనంగా నిర్మించబోయే మియాపూర్ X రోడ్డు ఫ్లై ఓవర్, అండర్ పాస్ నిర్మాణంలో భాగంగా ఇండ్లు, స్థలాలు కోల్పోతున్న ఇంద్రారెడ్డి ఆల్విన్ కాలనీ వాసులకు తగు న్యాయం చేయాలని పిఎసి చైర్మన్, శేరిలింగంపల్లి నియోజకవర్గ ఎమ్మెల్యే ఆరెకపూడి గాంధీని గురువారం మర్యాదపూర్వకంగా కలిసి వినతి పత్రం అందజేశారు.
ఈ సందర్భంగా ఇంద్రారెడ్డి ఆల్విన్ కాలనీ వాసులు మాట్లాడుతూ మియాపూర్ ఫ్లై ఓవర్ నిర్మాణం వలన స్థలాలు, మరియు ఇండ్లు కోల్పోతున్న మాకు తగిన న్యాయం చేయాలని, మాకు ఎటువంటి ఇబ్బంది లేకుండా అదుకోవాలని కాలనీ వాసులు పిఎసి చైర్మన్, శేరిలింగంపల్లి నియోజకవర్గ ఎమ్మెల్యే గాంధీకి విన్నవించుకున్నారు.ఈ సందర్భంగా పిఎసి చైర్మన్, శేరిలింగంపల్లి నియోజకవర్గ ఎమ్మెల్యే గాంధీ మాట్లాడుతూ మియాపూర్ ఫ్లై ఓవర్ నిర్మాణం, అండర్ పాస్ వలన రోడ్డు పక్కన ఉన్న ఇండ్లు కోల్పోతున్న బాధితులకు అన్ని విధాలుగా అండగా ఉంటామని, ఎవరు అధైర్య పడకూడదు అని,ప్రతి ఒక్కరికి న్యాయం చేస్తామని, అందరికీ ఆమోదయోగ్యంగా నష్టపరిహారం వచ్చేలా చూస్తాననీ, ప్రభుత్వం దృష్టికి తీసుకు వెళ్లి తప్పకుండా న్యాయం జరిగేలా చూస్తానని, అందరికీ టీడీఆర్ అందేలా చూస్తామని, అందరికీ ఆమోదయోగ్య విధంగా మియాపూర్ ఫ్లై ఓవర్ నిర్మాణం చేపట్టడం జరుగుతుంది అని తెలియచేశారు.
నిత్యం పెరుగుతున్న ట్రాఫిక్ దృష్ట్యా , ట్రాఫిక్ రహిత సమాజం కోసం, ప్రజల ఇబ్బందులను దృష్టిలో పెట్టుకొని ఫ్లై ఓవర్ ను నిర్మించడం జరుగుతుంది అని, ఫ్లై ఓవర్ నిర్మాణం చేపట్టడం జరుగుతుంది అని, ప్రతి ఒక్కరు సహకరించాలని,,రోడ్డు విస్తరణ, ఫ్లై ఓవర్ నిర్మాణం వలన ట్రాఫిక్ కష్టాలు తప్పునని, సమయం, ఇంధనం ఆదా అవునని ,ప్రజలకు సుఖవంతమైన ప్రయాణానికి బాటలు వేస్తామని తెలియచేశారు.
ఈ కార్యక్రమంలో ఇంద్రారెడ్డి రెడ్డి ఆల్విన్ కాలనీ వాసులు ,స్థానికులు తదితరులు పాల్గొన్నారు..



