- కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలి
- ఎల్బీనగర్ శాసనసభ్యులు దేవిరెడ్డి సుధీర్ రెడ్డి డిమాండ్.
ఎల్బీనగర్:
బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ దిశానిర్దేశం మేరకు కాంగ్రెస్ ప్రభుత్వం ఆటో కార్మికులకు ఇచ్చిన హామీలను అమలు చేయకుండా నిర్లక్ష్యం చేస్తున్న తీరును ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు ఎల్బీనగర్ బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్ రెడ్డి చైతన్యపురి డివిజన్ పరిధిలోని బాబు కాంప్లెక్స్ నుండి చైతన్యపురి వరకు ఆటో కార్మికుల మద్దతుగా పోరుబాట కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది.ఈ సందర్బంగా సుధీర్ రెడ్డి మాట్లాడుతూ, ఆటో కార్మికులు ఎన్నో ఏళ్లుగా ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించడంతో పాటు ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలను తక్షణమే అమలు చేయాలని డిమాండ్ చేశారు.ఆటో నడుపుతూ కుటుంబాలను పోషించుకుంటున్న కార్మికులపై భారం పెంచకుండా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని వారి సంక్షేమానికి ప్రత్యేక ప్రణాళిక రూపొందించాలని కోరారు. ముఖ్యంగా పలు ప్రధాన డిమాండ్లు తెలిపారు. దానిలో భాగంగా ఆటో కార్మికులకు ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని,ఆటో కార్మికుల సమస్యలను తక్షణమే పరిష్కరించాలని, ఆటో కార్మికుల సంక్షేమానికి ప్రత్యేక చర్యలు చేపట్టాలని, ఆటో కార్మికులకు ప్రభుత్వం ఇచ్చిన హామీలపై స్పష్టమైన కార్యాచరణ ప్రకటించాలని తెలిపారు.అనంతరం ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి ఆటో నడుపుతూ భారీ ఆటో ర్యాలీ నిర్వహించారు. ఈ పోరుబాట కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్లు జిన్నారం విఠల్ రెడ్డి, కొప్పుల విఠల్ రెడ్డి, పద్మ నాయక్ డివిజన్ల బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు తోట మహేష్ యాదవ్,లింగాల రాహుల్ గౌడ్,నాయకులు ఓరుగంటి వెంకటేష్,సొంటి చంద్రశేఖర్ రెడ్డి, విశ్వప్రేమ్ కుమార్,శివ ప్రకాష్ పలువురు ఆటో కార్మికులు,బీఆర్ఎస్ పార్టీ మహిళా నాయకురాళ్లు, నాయకులు, కార్యకర్తలు, ప్రజలు పెద్ద సంఖ్యలో తరలివచ్చి విజయవంతం చేశారు.



