Wednesday, November 25, 2026
Google search engine
Homeతెలంగాణకృష్ణ..కృష్ణ..చీ..ఛీ ఇదేం పాడు పని!

కృష్ణ..కృష్ణ..చీ..ఛీ ఇదేం పాడు పని!

స్మశాన వాటికల్లో నీళ్ల దోపిడీ.
అడ్డుకోలేని జలమండలి అధికారులు!

ప్రైవేటు బోర్ల నుండి నీళ్లు నింపి
జలమండలి ట్యాంకర్ల పేరుతో విక్రయిస్తున్నారు..
విజిలెన్స్ అధికారులు ఒకసారి ఎల్బీనగర్ వైపు చూడరు

భూగర్భ జలాలను కొల్లగొడుతున్న నీటి మాఫియాపై సమగ్ర విచారణ ఎక్కడ????

భారత శక్తి ,ఎల్బీనగర్

స్మశాన వాటికలను సైతం నీటి దోపిడీకి అడ్డాగా మార్చుకుంటున్న కొందరు వ్యక్తుల చర్యలపై బీసీ పీపుల్స్ ఫెడరేషన్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది.
స్మశాన వాటికలను లక్ష్యంగా చేసుకొని కొందరు వ్యక్తులు మనసురాబాద్ లో నీటిని అక్రమంగా వినియోగిస్తూ జలదోపిడీకి పాల్పడుతున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు.
ఈ వ్యవహారాన్ని అరికట్టాల్సిన జలమండలి అధికారులు పట్టించుకోకపోవడం దారుణమని బీసీ పీపుల్స్ ఫెడరేషన్ వ్యవస్థాపక అధ్యక్షుడు బొంగు వెంకటేష్ గౌడ్ విమర్శించారు.
స్మశాన వాటికలు ప్రజలందరికీ సంబంధించిన పవిత్ర స్థలాలు. వాటిని సైతం అక్రమ నీటి వ్యాపారాలకు ఉపయోగించుకోవడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు
అదేవిధంగా జలమండలి అధికారుల నిర్లక్ష్యంపై శాఖాపరమైన చర్యలు తీసుకోవాలని బీసీ పీపుల్స్ ఫెడరేషన్ వ్యవస్థాపక అధ్యక్షులు బొంగు వెంకటేష్ గౌడ్ డిమాండ్ చేశారు.
హైదరాబాద్ నగరంలో ముఖ్యంగా ఎల్బీనగర్ నియోజకవర్గ పరిధిలో ప్రైవేట్ వ్యక్తులు కొందరు భూగర్భ జలాలను యథేచ్ఛగా నీటిని తోడుతూ నీటిని వ్యాపారంగా మార్చుకొని ప్రజల అవసరాలను ఆసరాగా చేసుకుని కోట్లాది రూపాయల వ్యాపారం చేస్తున్నారనే ఆరోపణలు వస్తున్నాయి.
ముఖ్యంగా మన్సూరాబాద్, ఆటోనగర్, భాగ్యలత, సామ నగర్, సాహెబ్ నగర్, హయత్ నగర్ బీఎన్ రెడ్డి నగర్, నాగోల్ తదితర ప్రాంతాల్లో కొందరు ప్రైవేట్ వ్యక్తులు తమ స్థలాల్లో బోర్లు వేసి భూగర్భ జలాలను ట్యాంకర్లలో నింపి విక్రయిస్తున్నట్లు మా దృష్టికి వచ్చింది.మరోవైపు ప్రైవేట్ బోర్ల నుంచి నీటిని తీసుకొచ్చి జలమండలి (HMWS&SB) పేరుతో ఉన్న ట్యాంకర్లలో నింపి ప్రజలకు సరఫరా చేస్తున్నారనే అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి…
దీనివల్ల ప్రజలు జలమండలి ద్వారా సరఫరా అవుతున్న నీరేనని భావించే అవకాశం ఉంది. ఒక్కో ట్యాంకర్ నీటిని రూ.1,500 నుంచి రూ.2,000 వరకు విక్రయిస్తూ ప్రజల అవసరాలను వ్యాపారంగా మార్చుకుంటున్నారనే ఆరోపణలపై అధికారులు తక్షణమే విచారణ జరపాలి.

ఒకవైపు రాష్ట్రంలో వర్షాభావ పరిస్థితులు, ఎల్‌నినో ప్రభావం, భూగర్భ జలాల తగ్గుదల కారణంగా వ్యవసాయానికి, తాగునీటికి ఇబ్బందులు ఎదురవుతున్నాయి. హైదరాబాద్‌లో అనేక ప్రాంతాల్లో వందల వేల అడుగుల లోతుకు బోర్లు వేసినా నీరు లభించని పరిస్థితులు ఉన్నాయి. ఇలాంటి సమయంలో కొందరు వ్యక్తులు వాల్టా చట్ట నిబంధనలను ఉల్లంఘిస్తూ భూగర్భ జలాలను వ్యాపార అవసరాలకు వినియోగిస్తుంటే సంబంధిత అధికారులు ఏం చేస్తున్నారని
బీసీ పీపుల్స్ ఫెడరేషన్ ప్రశ్నిస్తుంది.
అధికారుల అండ దండలతోనే నీటి
వ్యాపారం జరుగుతుంది.
జలమండలి అధికారులు, ఎల్బీనగర్ నియోజకవర్గ పరిధిలోని సంబంధిత మేనేజింగ్ డైరెక్టర్, ఏఈలు ఈ వ్యవహారంపై బీసీ పీపుల్స్ ఫెడరేషన్ ఫోన్లో సంప్రదించగా ప్రైవేటు వ్యక్తుల బోర్ల దగ్గరికి వెళ్లే అధికారం మాకు లేదని జలమండలి ట్యాంకర్లు రాత్రి వేళలో ప్రైవేటు వ్యక్తుల బోర్ల నుంచి నీటిని సేకరించి జలమండలి ట్యాంకర్లలో నింపుతున్నారని అధికారులకు చెప్పిన చూసీ చూడనట్టు వ్యవహరిస్తున్నారని ఆరోపించారు…
వచ్చే వేసవిని దృష్టిలో పెట్టుకొని ఇప్పటి నుంచే భూగర్భ జలాల పరిరక్షణకు ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి.
ఇప్పుడే ఈ నీటి దోపిడీని అరికట్టకపోతే భవిష్యత్తులో హైదరాబాద్ ప్రజలు తాగునీటి కోసం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొనే ప్రమాదం ఉంది.
ప్రజల తాగునీటి అవసరాలను వ్యాపారంగా మార్చుకొని భూగర్భ జలాలను దోచుకుంటున్న నీటి మాఫియాను అరికట్టాల్సిన బాధ్యత ప్రభుత్వంపై, జలమండలి అధికారులపై ఉన్నదని అన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments