పి ఏ సి చైర్మన్, ఎమ్మెల్యే అరేకపూడి గాంధీ.
శేరిలింగంపల్లి :
హఫీజ్‌పేట్ డివిజన్ పరిధిలోని హుడా కాలనీ గల జయశంకర్ పార్క్ లో నూతన భూగర్భ జల గొట్టపు బావి (మంచి నీటి బోర్) ను మాజీ కార్పొరేటర్ జగదీశ్వర్ గౌడ్‌తో కలిసి ప్రారంభించిన పిఏసి చైర్మన్, శేరిలింగంపల్లి నియోజకవర్గ ఎమ్మెల్యే ఆరెక పూడి గాంధీ.ఈ సందర్భంగా పిఏసి చైర్మన్, శేరిలింగంపల్లి నియోజకవర్గ ఎమ్మెల్యే గాంధీ మాట్లాడుతూ జయశంకర్ పార్క్ లో భూగర్భ జల గొట్టపు బావి (బోర్) ను ప్రారంభించుకోవడం చాలా సంతోషకరమైన విషయం అని ,పార్క్ అభివృద్ది కి ఎంతగానో ఉపయోగపడుతుంది అని , మొక్కల పరిరక్షణ కు ఈ మంచి నీటి బోర్ ఎంతగానో ఉపయోగపడుతుంది అని, చక్కగా సద్వినియోగం చేసుకోవాలని తెలియచేశారు. ప్రతి కాలనీలో ప్రతి ఒక్కరు ఇంటి ఆవరణలో ఇంకుడు గుంత ను తప్పనిసరిగా ఏర్పాటు చేసుకోవాలని, వర్షపు నీటి ని ఒడిసి పట్టుకోవాలని, ఇంటి ఆవరణ ప్రాంతంలో ఇంకుడు గుంత ను ఏర్పాటు చేసుకొని ప్రతి కాలనీ కి ఆదర్శంగా నిలవాలని ఒక సామాజిక బాధ్యత గా ఇంకుడు గుంతలు ఏర్పాటు చేసుకోవాలని , మన పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని తెలియచేశారు.జయశంకర్ పార్కు లో అన్ని రకాల మౌలిక వసతులు కల్పించడం జరిగినది అని, పార్కు ను అన్ని రంగాలలో అభివృద్ది చేయడం జరిగినది అని , మౌలిక వసతుల కల్పన కు పెద్ద పీట వేయడం జరిగినది అని , పార్క్ లో వాకింగ్ వచ్చేవారికి , సేద తీరే వృద్ధులకు అన్ని వసతులు కల్పించడం జరిగినది అని, చిన్న పిల్లలకు ఆటవిడుపు పరికరాలు ఏర్పాటు చేయడం జరిగినది అని, పుస్తక పఠనం కోసం లైబ్రరీ ని ఏర్పాటు చేయడం జరిగినది అని, జయ శంకర్ పార్క్ ను సుందర శోభిత వనం గా తీర్చిదిద్దుతామని, చక్కటి ఆహ్లాదకరమైన వాతావరణం కల్పిస్తామని, మరియు హఫీజ్‌పేట్ డివిజన్ అభివృద్ధికి శాయశక్తుల కృషి చేస్తామని తెలియచేశారు .
ఈ కార్యక్రమంలో నాయకులు,కార్యకర్తలు, కాలనీ వాసులు తదితరులు పాల్గొన్నారు



