ఎల్బీనగర్
కర్మన్‌ఘాట్‌లోని గాయత్రి నగర్, రాయల్ ఓక్ సమీపంలో గుర్తుతెలియని వ్యక్తి మృతదేహం లభ్యమైంది.నవంబర్ 23వ తేదీ రాత్రి సుమారు 8.21 గంటల సమయంలో ఓ వ్యక్తి అపస్మారక స్థితిలో పడి ఉన్నాడంటూ డయల్ 100కు సమాచారం అందింది.దీంతో వెంటనే స్పందించిన సరూర్‌నగర్ పోలీస్ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకున్నారు. అక్కడ సుమారు 35 నుంచి 40 ఏళ్ల వయస్సు కలిగిన వ్యక్తి పడి ఉండటాన్ని గుర్తించి అంబులెన్స్‌కు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న అంబులెన్స్ సిబ్బంది పరీక్షించగా, అప్పటికే అతను మృతి చెందినట్లు నిర్ధారించారు.మృతుడి వివరాల కోసం పోలీసులు విచారించినప్పటికీ ఎలాంటి సమాచారం లభించలేదు. దీంతో కేసు నమోదు చేసి, తదుపరి దర్యాప్తు చేపట్టారు. అనంతరం మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా జనరల్ ఆసుపత్రికి తరలించారు.మృతుడి ఆచూకీ తెలిసినవారు లేదా అతని కుటుంబ సభ్యులు ఎవరైనా ఉంటే సరూర్‌నగర్ పోలీస్ స్టేషన్‌ను 8712662342, 8712662335 నంబర్లలో సంప్రదించాలని సర్కిల్ ఇన్స్పెక్టర్ శ్రీశైలం కోరారు.


