Monday, October 12, 2026
Google search engine
Homeతెలంగాణగచ్చిబౌలి డివిజన్ పరిధిలోని గచ్చిబౌలి స్టేడియంలో గ్రేస్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన క్యాన్సర్ అవగాహన ర్యాలీ

గచ్చిబౌలి డివిజన్ పరిధిలోని గచ్చిబౌలి స్టేడియంలో గ్రేస్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన క్యాన్సర్ అవగాహన ర్యాలీ

క్యాన్సర్ 5K రన్ ను మంత్రులు పొన్నం ప్రభాకర్, వాకిటి శ్రీహరి, పి ఏ సి చైర్మన్, శేరిలింగంపల్లి ఎమ్మెల్యే అరేకపూడి గాంధీ, హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సజ్జనార్, సైబరాబాద్ పోలీస్ కమిషనర్ రమేష్ రెడ్డిలతో కలిసి పాల్గొని జెండా ఊపి ర్యాలీని ప్రారంభించారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ క్యాన్సర్‌పై సమష్టి పోరాటంతోనే విజయం సాధ్యం అని,
క్యాన్సర్‌పై ప్రజల్లో విస్తృత అవగాహన కల్పించాలి అని, గ్రేస్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో గచ్చిబౌలి స్టేడియంలో క్యాన్సర్ రన్ నిర్వహించడం చాలా గొప్ప విషయం అన్నారు.

క్యాన్సర్‌పై ప్రజల్లో విస్తృత అవగాహన కల్పించి, వ్యాధి నివారణ, ముందస్తు గుర్తింపు ప్రాముఖ్యతను ప్రతి ఒక్కరికీ తెలియజేయాల్సిన బాధ్యత మనందరిపై ఉందని, ప్రజారోగ్యం కోసం గ్రేస్ ఫౌండేషన్ చేపట్టిన ఈ అవగాహన కార్యక్రమం అభినందనీయమని, ఇలాంటి కార్యక్రమాల్లో యువత పెద్ద సంఖ్యలో పాల్గొనడం స్ఫూర్తిదాయకమని అన్నారు. క్యాన్సర్‌పై అవగాహనను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లేందుకు ప్రతి ఒక్కరూ తమ వంతు కృషి చేయాలని పిలుపునిచ్చారు.

క్యాన్సర్‌పై ప్రజల్లో విస్తృత అవగాహన కల్పించడం, వ్యాధి పట్ల ఉన్న అపోహలను తొలగించడం, ముందస్తు గుర్తింపు పరీక్షల ప్రాముఖ్యతను ప్రజలకు తెలియజేయడం మనందరి బాధ్యత. క్యాన్సర్‌ను ప్రారంభ దశలో గుర్తించడం ద్వారా మెరుగైన చికిత్స పొందే అవకాశాలు పెరుగుతాయి.

క్యాన్సర్‌పై పోరాటం ఒక్కరి బాధ్యత కాదు. ప్రభుత్వం, వైద్యులు, స్వచ్ఛంద సంస్థలు, ప్రజలు సమిష్టిగా కృషి చేసినప్పుడే క్యాన్సర్ ముప్పును తగ్గించి ఆరోగ్యవంతమైన సమాజాన్ని నిర్మించగలం.

క్యాన్సర్ రహిత తెలంగాణ నిర్మాణమే మన లక్ష్యంగా ముందుకు సాగాలి. ప్రజల్లో అవగాహన పెంపొందిస్తూ, నివారణ చర్యలకు ప్రాధాన్యతనిస్తూ ఆరోగ్యకరమైన సమాజ నిర్మాణంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలన్నారు.

క్యాన్సర్‌పై పోరాటం ఒక వ్యక్తి లేదా ఒక సంస్థ బాధ్యత మాత్రమే కాదని, సమాజమంతా కలిసికట్టుగా ముందుకు సాగాల్సిన అవసరం ఉందని, భారత దేశం నుంచి క్యాన్సర్ మహమ్మారిని తరిమివేసే మహా యజ్ఞంలో యువత భాగస్వాములు కావాలని ,క్యాన్సర్ మహమ్మారిని సమాజం నుంచి పారద్రోలేందుకు ప్రతి ఒక్కరూ బాధ్యతగా వ్యవహరించాలని, ఆరోగ్యకరమైన సమాజ నిర్మాణం కోసం ప్రభుత్వంతో పాటు ప్రజలు, వైద్యులు, స్వచ్ఛంద సంస్థలు సమిష్టిగా కృషి చేయాలని తెలియచేశారు. ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించిన గ్రేస్ ఫౌండేషన్ నిర్వాహకులకు, పాల్గొన్న ప్రజాప్రతినిధులకు, పోలీసు అధికారులకు, యువతీ యువకులకు అభినందనలు తెలిపారు.

ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, నాయకులు, పోలీస్ అధికారులు, యువతి, యువకులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments