హైదరాబాద్:
రాష్ట్ర గవర్నర్ శ్రీ శివ ప్రతాప్ శుక్లాను పలువురు ప్రముఖులు సోమవారం లోక్‌భవన్‌లో మర్యాదపూర్వకంగా కలిశారు.
ఇండియన్ ఆర్మీ దక్షిణ భారత ప్రాంతం జెనరల్ ఆఫీసర్ కమాండింగ్ లెఫ్టినెంట్ జనరల్ ఉల్హాస్ కిర్పేకర్ గవర్నర్ ను కలిశారు.సైనిక, రక్షణ అంశాలపై గవర్నర్‌తో చర్చించారు.
ఏఎస్‌సీఐ ఛైర్మన్ శ్రీ కె. పద్మనాభయ్య , యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ వీసీ ప్రొఫెసర్ జె. అనురాధ, కాకతీయ విశ్వవిద్యాలయం వీసీ ప్రొఫెసర్ కె. ప్రతాప్‌రెడ్డి, ఉస్మానియా విశ్వవిద్యాలయం వీసీ ప్రొఫెసర్ కుమార్ మోలుగారం ,, ,సాలార్‌జంగ్ మ్యూజియం నూతన బోర్డు సభ్యులు ప్రొఫెసర్ వి. కిషన్‌రావు, డాక్టర్ శ్రీపెరంబుదూర్ జైకిషన్, డాక్టర్ రాజిరెడ్డి సీలం తదితరులు గవర్నర్‌ను కలిశారు. ఈ సందర్భంగా ఆయా సంస్థలకు సంబంధించిన వివిధ అంశాలపై గవర్నర్‌తో వారు చర్చించారు.


