Friday, September 18, 2026
Google search engine
Homeతెలంగాణచేతివృత్తుల అభివృద్ధికి ప్రధాని మోదీ ప్రభుత్వం ప్రత్యేక ప్రాధాన్యత..

చేతివృత్తుల అభివృద్ధికి ప్రధాని మోదీ ప్రభుత్వం ప్రత్యేక ప్రాధాన్యత..

విశ్వకర్మ జయంతి వేడుకల్లో పాల్గొన్న – బద్దం ప్రేమ్ మహేశ్వర్ రెడ్డి..

ఎల్బీనగర్:

మానవ మనుగడకు మార్గదర్శకుడు, సకల చరాచర సృష్టికి మరియు సమస్త వృత్తులకు మూలకారకుడైన విశ్వకర్మ భగవానుడి జయంతి సందర్భంగా దిల్‌సుఖ్‌నగర్ విశ్వకర్మ స్వర్ణకారుల సంఘం అధ్యక్షులు అనంత చారీ, ఉత్సవ కమిటీ చైర్మన్ ప్రవీణ్ ఆధ్వర్యంలో గడ్డిఅన్నారం డివిజన్ పరిధిలోని గౌతమ్ నగర్ కాలనీలో ఉన్న స్వర్ణకారుల మార్కెట్ వద్ద విశ్వకర్మ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు.ఈ కార్యక్రమానికి గడ్డిఅన్నారం డివిజన్ తాజా మాజీ కార్పొరేటర్, బీజేపీ నాయకులు బద్దం ప్రేమ్ మహేశ్వర్ రెడ్డి హాజరై విశ్వకర్మ భగవానుడికి ప్రత్యేక పూజలు నిర్వహించి, స్వర్ణకారులు, చేతివృత్తుల కళాకారులు మరియు వారి కుటుంబ సభ్యులకు విశ్వకర్మ జయంతి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా బద్దం ప్రేమ్ మహేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ, దేశ అభివృద్ధిలో తరతరాలుగా చేతివృత్తులు, సంప్రదాయ వృత్తులను కొనసాగిస్తున్న విశ్వకర్మ కుటుంబాల పాత్ర ఎంతో కీలకమన్నారు.వారి నైపుణ్యాన్ని గుర్తించి ఆర్థికంగా, సాంకేతికంగా బలోపేతం చేయాలనే ఉద్దేశంతో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రభుత్వం ‘ప్రధానమంత్రి విశ్వకర్మ’ పథకాన్ని తీసుకువచ్చిందన్నారు.ఈ పథకం ద్వారా సంప్రదాయ చేతివృత్తుల వారికి నైపుణ్య శిక్షణ, ఆధునిక పని ముట్లకు సహాయం, రుణ సదుపాయం, మార్కెటింగ్ మరియు ఇతర సహాయక చర్యలు అందించే విధంగా కేంద్ర ప్రభుత్వం చర్యలు చేపట్టిందని తెలిపారు. స్వర్ణకారులు సహా అర్హత కలిగిన విశ్వకర్మ వృత్తిదారులు ఈ పథకాన్ని సద్వినియోగం చేసుకుని తమ వృత్తిని మరింత అభివృద్ధి చేసుకోవాలని సూచించారు. విశ్వకర్మ భగవానుడి ఆశీస్సులతో ప్రతి కుటుంబంలో సుఖ సంతోషాలు,ఆయురారోగ్యాలు, ఆర్థిక అభివృద్ధి కలగాలని ఆకాంక్షించారు. సంప్రదాయ చేతివృత్తులను కాపాడుకుంటూ, ఆధునిక సాంకేతికతను అందిపుచ్చుకుని యువతకు ఉపాధి అవకాశాలు కల్పించే దిశగా ముందుకు సాగాలని పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో విశ్వకర్మ స్వర్ణకారుల సంఘం సభ్యులు, స్థానిక నాయకులు, స్వర్ణకారులు తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments