గజ్వెల్:
సిద్దిపేట జిల్లా గజ్వెల్ మండలం ధర్మారెడ్డిపల్లి గ్రామంలో మంగళవారం డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా సర్పంచ్ శ్రీనివాస్, ఉప సర్పంచ్ ముత్యాలు గౌడ్‌తో పాటు పాలకవర్గ సభ్యులు అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.ఈ సందర్భంగా వారు అంబేద్కర్ అందరి వాడని కొనియాడుతూ, ఆయన చూపిన మార్గంలో నడవాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో జెజాల వెంకటేశం, హన్మంత రెడ్డి, కిషన్, జగన్, యాదగిరి, భూపాల్, కిష్టయ్య, శ్రీకాంత్, అశోక్ తదితరులు పాల్గొన్నారు.


