ఎల్బీనగర్
హైదరాబాద్ -రంగారెడ్డి – మహబూబ్ నగర్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఓటరు నమోదు కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా పాల్గొన్న ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్ రెడ్డి. కొత్తపేట డివిజన్ పరిధిలోని మోహన్ నగర్ వద్ద జరిగిన పట్టభద్రుల ఎమ్మెల్సీ ఓటరు నమోదు కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు.ఈ సందర్భంగా అర్హులైన పట్టభద్రులందరూ ఎమ్మెల్సీ ఓటరుగా తమ పేర్లను నమోదు చేసుకోవాలని, ప్రజాస్వామ్య ప్రక్రియలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని ఆయన పిలుపునిచ్చారు. పట్టభద్రులు తమ ఓటు హక్కును వినియోగించుకునేలా ఓటరు నమోదు ప్రక్రియపై అవగాహన కల్పించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో డివిజన్ భారాస పార్టీ అధ్యక్షులు లింగాల రాహుల్ గౌడ్, జహీర్ ఖాన్, పాండుగౌడ్, రూపసింగ్,అనురాధ,పద్మ ,విజయలక్ష్మి,రాజు,లింగేశ్వర్,శశి,భాస్కర్ శీను తదితరులు పాల్గొన్నారు.


