Tuesday, August 18, 2026
Google search engine
Homeతెలంగాణపోక్సో కేసులో నిందితుడికి మూడేళ్ల జైలు శిక్ష

పోక్సో కేసులో నిందితుడికి మూడేళ్ల జైలు శిక్ష

ఎల్బీనగర్:

పోక్సో కేసులో నిందితుడికి మూడేళ్ల జైలు శిక్ష, రూ.3 వేల జరిమానా విధిస్తూ ఎల్బీనగర్‌ లోని రంగారెడ్డి జిల్లా ఫాస్ట్‌ట్రాక్ స్పెషల్ కోర్టు సోమవారం తీర్పు వెలువరించింది.నాగోల్ పోలీస్‌స్టేషన్‌లో నమోదైన క్రైం నంబర్ 405/2025, బీఎన్‌ఎస్ సెక్షన్ 78, పోక్సో చట్టంలోని సెక్షన్ 11 రెడ్ విత్ 12 కేసులో నిందితుడు ఉప్పు రాకేష్ (24)ను కోర్టు దోషిగా నిర్ధారించింది. నిందితుడికి మూడేళ్ల జైలు శిక్షతో పాటు రూ.3,000 జరిమానా విధించింది. బాధితురాలికి రూ.50,000 పరిహారం అందించాలని ఆదేశించింది.ఈ కేసులో నాగోల్ ఎస్‌ఐ పి. శివ నాగ ప్రసాద్ దర్యాప్తు చేపట్టారు. అదనపు పీపీలు శోభారాణి, పి. సత్యనారాయణ ప్రాసిక్యూషన్ తరఫున వాదనలు వినిపించారు.కేసు విచారణలో నాగోల్ పోలీస్‌స్టేషన్ కోర్టు కానిస్టేబుల్ రాజు, సమన్స్ కానిస్టేబుల్ వెంకటేష్, ఏఎస్సై పి. శోభ సహకరించారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments