Monday, September 28, 2026
Google search engine
Homeతెలంగాణప్రభుత్వ పాఠశాలల అభివృద్ధికి ప్రభుత్వము ప్రథమ ప్రాధాన్యత:ఎమ్మెల్యే మల్‌రెడ్డి రంగారెడ్డి.

ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధికి ప్రభుత్వము ప్రథమ ప్రాధాన్యత:ఎమ్మెల్యే మల్‌రెడ్డి రంగారెడ్డి.

  • ఎస్టీయూటీఎస్‌ఏ ఎనభై ఏళ్ల ప్రస్థానం అభినందనీయం
  • ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారానికి సర్కార్ కట్టుబడి ఉంది.

హైదరాబాద్

తెలంగాణ రాష్ట్ర ఉపాధ్యాయ సంఘం (ఎస్టీయూటీఎస్‌ఏ) ఎనభై సంవత్సరాల ప్రస్థానంలో సాధించిన విజయాలు చారిత్రాత్మకమని, అదే స్ఫూర్తితో ఉపాధ్యాయ లోకం ముందుకు సాగాలని ఇబ్రహీంపట్నం శాసనసభ్యులు మల్‌రెడ్డి రంగారెడ్డి పిలుపునిచ్చారు. హైదరాబాద్‌ నాగోల్‌లోని శుభం కన్వెన్షన్‌లో ఎస్టీయూటీఎస్‌ఏ ఆధ్వర్యంలో నిర్వహించిన అఖిల భారత స్థాయి ఎనభైవ వసంత వేడుకలకు ఆయన రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబుతో కలిసి ముఖ్య అతిథిగా హాజరయ్యారు.

*ఉపాధ్యాయుల పాత్ర వెలకట్టలేనిది:
విద్యార్థుల భవిష్యత్తుకు బంగారు బాటలు వేయడంలో ఉపాధ్యాయుల శ్రమ అపారమైనదని శాసనసభ్యులు కొనియాడారు. ప్రైవేటు విద్యాసంస్థలకు దీటుగా ప్రభుత్వ పాఠశాలలను తీర్చిదిద్దడమే ధ్యేయంగా రాష్ట్ర ప్రభుత్వము అడుగులు వేస్తోందని స్పష్టం చేశారు. పేద విద్యార్థులకు నాణ్యమైన విద్యనందించే క్రమంలో ఉపాధ్యాయులు చేస్తున్న సేవలు ప్రశంసనీయమని పేర్కొన్నారు.

*సమస్యల పరిష్కారమే లక్ష్యంగా రేవంత్ రెడ్డి ప్రభుత్వం
ఉపాధ్యాయులు ఎదుర్కొంటున్న దీర్ఘకాలిక సమస్యలన్నింటినీ శాశ్వత ప్రాతిపదికన పరిష్కరించేందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలోని ప్రభుత్వము సంపూర్ణంగా కట్టుబడి ఉందని మల్‌రెడ్డి రంగారెడ్డి భరోసానిచ్చారు. ఉపాధ్యాయుల సంక్షేమమే ధ్యేయంగా పాలన సాగుతోందని, ఎటువంటి సందేహాలు అనవసరమని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో సంఘం నాయకులు, రాష్ట్ర నలుమూలల నుండి విచ్చేసిన వందలాది ఉపాధ్యాయులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా శాసనసభ్యులు మల్‌రెడ్డి రంగారెడ్డిని ఉపాధ్యాయ సంఘం నేతలు ఘనంగా సన్మానించారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments