Wednesday, July 29, 2026
Google search engine
Homeతెలంగాణబడంగ్‌పేట్‌లో ఓటరు జాబితా సవరణపై రాజకీయ పార్టీలతో సమీక్షా సమావేశం

బడంగ్‌పేట్‌లో ఓటరు జాబితా సవరణపై రాజకీయ పార్టీలతో సమీక్షా సమావేశం

పెండింగ్ ఓటర్ల వివరాల అందజేత.. ఆగస్టు 3 లోగా సమాచారం అందించాలని అధికారుల స్పష్టీకరణ

బడంగ్‌పేట్

ప్రత్యేక సమగ్ర ఓటరు జాబితా సవరణ (ఎస్‌ఐఆర్)-2026 కార్యక్రమ లక్ష్యాలు, పురోగతిపై మంగళవారం బడంగ్‌పేట్ సర్కిల్ సమావేశ మందిరంలో గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల ప్రతినిధులతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. డిప్యూటీ కమిషనర్ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో ఓటరు జాబితా రూపకల్పన, క్షేత్రస్థాయి ఏర్పాట్లపై చర్చించారు.

*సమావేశంలోని ప్రధాన అంశాలు:
*డిజిటలైజేషన్ పురోగతి: ఈ నెల 28 నాటికి బడంగ్‌పేట్ ఈఆర్ఓ పరిధిలో మొత్తం 1,62,312 మంది ఓటర్లకు గాను, ఇప్పటివరకు 44.26 శాతం చొప్పున 71,840 ఓటర్ ఎన్యూమరేషన్ ఫారాల డిజిటలైజేషన్ పూర్తయింది.
*పెండింగ్ ఓటర్లు: ఇళ్లు తాళం వేసి ఉండటం మరియు ఓటర్లు అందుబాటులో లేకపోవడం వల్ల నిలిచిపోయిన 90,472 పెండింగ్ ఓటర్ల పోలింగ్ స్టేషన్ల వారీ జాబితాను పెన్‌డ్రైవ్ రూపంలో రాజకీయ పార్టీల ప్రతినిధులకు అందించారు.

*గడువు – హెచ్చరిక:
పెండింగ్ ఓటర్లకు సంబంధించిన వివరాలను రాజకీయ పార్టీల ప్రతినిధులు ఆగస్టు 3వ తేదీ లోపు సంబంధిత బూత్ లెవల్ ఆఫీసర్ (బీఎల్‌ఓ)కు అందజేయాలి. లేనిపక్షంలో ఆ ఓటర్ల పేర్లు జాబితా నుండి తొలగించబడతాయి. ఆగస్టు 10న ప్రచురించే డ్రాఫ్ట్ ఓటర్ జాబితాలో వీరు నమోదు కారు.

*పోలింగ్ స్టేషన్ల హేతుబద్ధీకరణ: హేతుబద్ధీకరణపై ఏవైనా అభ్యంతరాలు, సూచనలు ఉంటే ఈ గురువారం లోపు మహేశ్వరం ఎన్నికల నమోదు అధికారికి (ఈఆర్ఓ) లిఖితపూర్వకంగా సమర్పించాలని కోరారు.
ఖచ్చితమైన, దోషరహిత ఓటరు జాబితా రూపకల్పనకు రాజకీయ పార్టీల ప్రతినిధులు, బూత్ లెవల్ ఏజెంట్లు (బీఎల్‌ఏలు) మరియు ప్రజలు పూర్తి సహకారం అందించాలని అధికారులు విజ్ఞప్తి చేశారు. ఓటర్లందరూ తమ వివరాలను నిర్ణీత గడువులోగా సమర్పించి, ఓటరు జాబితాలో తమ పేరు ఉండేలా చూసుకోవాలని సూచించారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments