మన్సూరాబాద్ డివిజన్ బాలాజీ నగర్, మల్లికార్జున నగర్, జడ్జెస్ కాలనీ ఇతర ప్రాంతాల్లో అనుమతులు లేకుండా తీసిన డ్రైనేజ్ పైపు లైన్లను తొలగించారు. జలమండలి శాఖకు డబ్బులు కట్టకుండా, అవినీతి సిబ్బంది చేతులు తడిపి, బహుళ అంతస్తుల భవనాలకు డ్రైనేజీ పైప్ లైన్లు వేసుకుంటే కఠిన చర్యలు తీసుకుంటామని జలమండలి అధికారులు హెచ్చరించారు.



