Wednesday, October 14, 2026
Google search engine
Homeతెలంగాణమధుసూదనాచారి జన్మదినం సందర్భంగా 'రెడీ టు సర్వ్ ఫౌండేషన్'లో సేవా కార్యక్రమాలు

మధుసూదనాచారి జన్మదినం సందర్భంగా ‘రెడీ టు సర్వ్ ఫౌండేషన్’లో సేవా కార్యక్రమాలు

▪️ వృద్ధులకు అన్నదానం.. బెడ్‌షీట్లు, నిత్యావసర సరుకుల పంపిణీ
▪️ వనస్థలిపురం వృద్ధాశ్రమంలో సేవా కార్యక్రమం

ఎల్బీనగర్

శాసనమండలి ప్రతిపక్ష నేత, ఎమ్మెల్సీ సిరికొండ మధుసూదనాచారి జన్మదినాన్ని పురస్కరించుకుని రెడీ టు సర్వ్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో సేవా కార్యక్రమాలు నిర్వహించారు. బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు శివప్రకాష్ ఆధ్వర్యంలో వనస్థలిపురంలోని ఓ వృద్ధాశ్రమంలో ఈ కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా వృద్ధులకు అన్నదానం చేయడంతో పాటు బెడ్‌షీట్లు, నిత్యావసర సరుకులను పంపిణీ చేశారు. పుట్టినరోజు వేడుకలను సేవా కార్యక్రమాలతో జరుపుకోవడం ద్వారా సమాజంలో మానవత్వం, సేవాభావం మరింత పెంపొందుతాయని నిర్వాహకులు పేర్కొన్నారు.

ఈ సందర్భంగా శివప్రకాష్ మాట్లాడుతూ.. సిరికొండ మధుసూదనాచారి మరిన్ని జన్మదిన వేడుకలు జరుపుకోవాలని ఆకాంక్షించారు. ఆయన చేపట్టే ప్రయత్నాలన్నీ విజయవంతం కావాలని, భవిష్యత్తులో మరింత ఉన్నత స్థాయికి చేరుకోవాలని కోరుకున్నారు. భగవంతుడు ఆయనకు సంపూర్ణ ఆయురారోగ్యాలు, ఐశ్వర్యం ప్రసాదించాలని ప్రార్థించినట్లు తెలిపారు.

ఈ కార్యక్రమంలో యువజన నాయకులు నవీన్, రాకేష్, వినయ్ కుమార్, రవి యాదవ్, సాయి యాదవ్, కళ్యాణ్, రాజ్, లక్కీ గౌడ్, శరత్, కౌశిక్, వంశీ, మజీద్, నవీన్ కుమార్, పవన్, నరేష్, ఆసిఫ్, ప్రవీణ్, మహేష్ తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments