Friday, September 25, 2026
Google search engine
Homeతెలంగాణమసీదు బండలో 100 ఫీట్ల రోడ్డు లైన్ క్లియర్....

మసీదు బండలో 100 ఫీట్ల రోడ్డు లైన్ క్లియర్….

స్థలాలు, భవనాలు కోల్పోతున్న వారికి టిడిఆర్లను అందజేస్తాము… పిఎసి చైర్మన్, శేరిలింగంపల్లి నియోజకవర్గ ఎమ్మెల్యే అరెకపూడి గాంధీ.

మసీదు బండ వానులతో మాట్లాడుతున్న పిఎసి చైర్మన్, శేరిలింగంపల్లి నియోజకవర్గ ఎమ్మెల్యే అరెకపూడి గాంధీ.

శేరిలింగంపల్లి :

మసీదు బండ రోడ్డు విస్తరణ మాస్టర్ ప్లాన్లో 120 ఫీట్లు ఉంటే దానిని 100 ఫీట్లకు తీసుకురావడం జరిగిందని పిఎసి చైర్మన్, శేరిలింగంపల్లి నియోజకవర్గ ఎమ్మెల్యే అరెకపూడి గాంధీ అన్నారు. గురువారం శేరిలింగంపల్లి డివిజన్ పరిధిలోని మసీదు బండలో 100 ఫీట్ల రోడ్డు విస్తరణ కొరకు టౌన్ప్లేనింగ్ ఏసిపిలు ప్రసిద్ధ, నుష్మ, హబిబా, సీనియర్ నాయకులు రఘునాథ్ రెడ్డి, రాజు యాదవ్తో కలిసి మసీదు బండ 100 ఫీట్ల రోడ్డు విస్తరణలో భాగంగా స్థలాలు, భవనాలు కోల్పోతున్న వారికి 100 ఫీట్ల రోడ్డు విస్తరణ అంగీకార పత్రాలు అందజేయడం జరిగిందన్నారు. 120 ఫీట్లు ఉన్న రోడ్డు విస్తరణను 100 ఫీట్లకు తీసుకురావడం జరిగిందన్నారు. దానికి మసీదు బండ గ్రామస్తులందరు ఒప్పుకోవడం జరిగిందన్నారు. స్వచ్చందంగా ముందుకు వచ్చి స్థలము ఇచ్చేలా ఒప్పించడం జరిగిందన్నారు. అందరూ ముందుకు వచ్చి రోడ్డు విస్తరణకు ఒప్పకోవడం శుభపరిణామం అన్నారు. 100 ఫీట్ల రోడ్డు విస్తరణ అంగీకార పత్రాలను రోడ్డు విస్తరణలో భవనాలు, స్థలాలు కోల్పోతున్న వారికి టిడిఆర్లను ఇచ్చేలా చూడాలని టిడిఆర్ ప్రక్రియను వేగవంతం చేయాలని, వారం రోజుల్లో పూర్తి చేయాలని, క్షేత్ర స్థాయిలో పరిశీలించి స్థలాలు, కోల్పోతున్న వారి వివరాలను సేకరించి తప్పకుండ న్యాయం జరిగేలా చూస్తానన్నారు. ఎన్నో ఏండ్ల నుండి రోడ్డు విస్తరణకు నోచుకొని మసీదు బంద రోడ్డు సమస్య నేటితో పరిష్కారం లభించిందన్నారు. శాశ్వత పరిష్కారం లభించిందన్నారు. తారానగర్, అంజయ్యనగర్ లో రోడ్డు విస్తరణలో భాగంగా స్థలాలు కోల్పోతన్న వారికి కూడా టిడిఆర్లు అందేలా చూడాలని, త్వరితగతిన పూర్తి చేయాలని అధికారులను క్షేత్రస్థాయిలో ఉండి వారంలోపు పనులు పూర్తి చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో అధికారులు, నాయకులు, కార్యకర్తలు, మసీదు బండ వాసులు తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments