Friday, September 25, 2026
Google search engine
Homeతెలంగాణపొగతో పెను ముప్పు...

పొగతో పెను ముప్పు…

  • ఊపిరితిత్తుల ఆరోగ్యంపై శ్రద్ద తీసుకోవాలి….
  • జీవితాంతం ఆరోగ్యకరమైన శ్వాస…
  • ఘనంగా అంతర్జాతీయ ఊపిరితిత్తుల దినోత్సవం కిమ్స్ హాస్పిటల్ డాక్టర్ శుభకర్ నాదేళ్ల.
  • కొండాపూర్ కిమ్స్ హాస్పిటల్ డాక్టర్ శుభకర్ నాదే……


శేరిలింగంపల్లి :

మనం పుట్టినప్పుటి నుండి చివరి శ్వాస వరకు నిరంతరం పని చేసే అవయవాల్లో ఊపిరితిత్తులు ముఖ్యమైనవని కొండాపూర్ కిమ్స్ హాస్పిటల్ డాక్టర్ శుభకర్ నాదేళ్ల అన్నారు. గురువారం అంతర్జాతీయ ఊరిపితిత్తుల దినోత్సవం పురస్కరించుకొని ఆయన మాట్లాడుతు పోగతో పెను ముప్పు అన్నారు. శరీరంలోని ప్రతి కణానికి అవసరమైన ఆక్సిజన్ను అందించడంతో పాటు, కార్బన్డయాక్సైడ్ను బయటకు పంపించడంలో ఇవి కీలక పాత్ర పోషిస్తాయన్నారు. పొగతాడగం, వాయు కాలుష్యం, దుమ్ము, రసాయనాల ప్రభావం, ఇన్ఫెక్షన్లు, అలర్జీలు, జీవనశైలిలో మార్పులు వంటి కారణాలతో ఊపిరితిత్తులపై భారం పెరుగుతోందన్నారు. ప్రతి ఏడది సెప్టెంబర్ 25న ప్రపంచ ఊపిరితిత్తుల దినోత్సవాన్ని నిర్వహిస్తామన్నారు. ఊపిరితిత్తుల ఆరోగ్యంపై ప్రజల్లో అవగాహన పెంచడం, శ్వాసకోశ వ్యాధులను నివారించడం, సకాలంలో గుర్తించి చికిత్స పొందేలా ప్రోత్సహించడం ఈ దినోత్సవం ప్రధాన ఉద్దేశం అన్నారు. 2026 సంవత్సరానికి ఏ లైఫ్ టైం ఆఫ్ లాంగ్ హెల్త్ (జీవితాంతం ఊపిరితిత్తుల (ఆరోగ్యం) అనే థీమ్ను ఫోరం ఆఫ్ ఇంటర్నేషనల్ రెస్పిరేటరీ సోసైటీస్ ప్రకటించింది. చిన్ననాటి నుండి వృద్ధాప్యం వరకు ప్రతి దశలో ఊపిరితిత్తుల ఆరోగ్యాన్ని కాపాడుకోవాల్సిన అవసరాలన్ని ఈ థీమ్ తెలియజేస్తోందన్నారు.

పొగతో పెను ముప్పు….

ఊపిరితిత్తులకు అత్యంత హానికరమైన అలవాట్లలో పొగతాగడం ఒకటి సిగరెట్, బీడీ, ఇతర పొగాకు ఉత్పపత్తు
ఊపిరితిత్తులకు అత్యంత హానికరమైన అలవాట్లలో పొగతాగడం ఒకటి సిగరెట్, బీడీ, ఇతర పొగాకు ఉత్పత్తులతో పాటు పక్కవారు తాగే పొగను పీల్చడం కూడా ప్రమాదకరమే. పొగాకులోని హానికర పదార్థాలు ఊపిరితిత్తుల కణజాలాన్ని దెబ్బతీస్తాయి. దీర్ఘకాలంలో శ్వాసకోశ వ్యాధులు, ఊపిరితిత్తుల క్యాన్సర్ వంటి సమస్యలకు దారితీస్తాయి. పొగాకు వినియోగడానికి సురక్షితమైన స్థాయి లేదని ప్రపంచ ఆరోగ్య సంస్థ పేర్కోంటోంది. పొగతాగడం మానేయడం ఊపిరితిత్తులను కాపాడుకోవడానికి తీసుకునే ముఖ్యమైన నిర్ణయం. ఎన్నో సంవత్సరాలుగా పొగతాగే అలవాటు ఉన్నవారు కూడా మానేస్తే ప్రయోజం ఉంటుంది. ఇంట్లో పొగతాగేవారు ఉంటే పిల్లలు, వృద్ధులు, గర్భిణులు పొగకు దూరంగా ఉండేలా జాగ్రత్తలు తీసుకోవాలి.

మీడియా అటాచ్‌మెంట్ ఫైల్‌లు

నగరంలో పెరుగుతున్న వాయు కాలుష్యం, పొగతాగడం దుమ్ము, వృత్తిపరమైన రసాయనాల ప్రభావం తదితర కారణాలతో శ్వాసకోశ సమస్యలతో ఆసుపత్రులను ఆశ్రయించే వారి సంఖ్య గణనీయంగా ఉంటోంది. జాతీయ స్థాయి అధ్యయనాలు మాత్రం నమస్య తీవ్రతను నూచిస్తున్నాయి. భారత్లో 45ఏళ్లు పైబడిన వారిపై నిర్వహించిన అధ్యయనంలో అస్తమా 4.38 శాతం, నీఓపీడి 2.1 శాతం మందిలో ఉన్నట్లు గుర్తించారు. వయసు పెరిగే కొద్దీ ఈ సమస్యలు మరింత ఎక్కువవుతున్నాయి. 45, 59 ఏళ్ల వారితో పొలిస్తే 60 ఏళ్లు పైబడిన వారిలో ఆస్తమా, సీఓపీడి రెండింటి ప్రాబల్యం అధికంగా నమోదైంది. అందుబాటులో ఉన్న జాతీయ అధ్యయనాల ప్రకారం ఆస్తమా, సీఓపీడీ రెండూ మహిళల కంటే పురుషుల్లో ఎక్కవగా నమోదయ్యాయి. పొగతాడగం, వృత్తిపరంగా దుమ్మ పొగకు గురికావడం వంటి కారణాలు దీనికి దోహదం చేస్తున్నాయి. ఆనువత్రుల్లో శ్వాస సంబంధిత సమస్యలతో వచ్చే రోగుల్లోనూ పురుషుల వాటా కొంత ఎక్కవగా ఉన్నట్లు దేశవ్యాప్తంగా నిర్వహించిన ఎన్ డబ్ల్యుఒఆర్డి అధ్యయనంలో నమోదైంది. దగ్గు ఆయానం ఉంటే నిర్లక్ష్యం వద్దు….

మూడు వారాలకు మించి దగ్గు, తరచూ ఆయాసం, పిల్లికూతలు, ఛాతీలో బిగుతు మొట్లు ఎక్కేటప్పుడు శ్వాస తీసుకోవడం ఇబ్బంది, కవంలో రక్తం వంటి లక్షణాలు ఉండే వైద్యులను సంప్రదించాలి. పొగతాగే అలవాటు ఉన్నవారు, కాలుష్యం లేదా దుమ్ములో వనిచేసేవారు ప్రత్యేకంగా జాగ్రత్తగా ఉండాలి. పోగతాగడం మానేయడం, కాలుష్యానికి దూరంగా ఉండటం, మాస్క్ ఉపయోగించడం క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం, అవసరమైన టీకాలు తీసుకోవడం, లక్షణాలు కనిపించిన వెంటనే వైద్యులను సంప్రదించడం ద్వారా ఊపిరితిత్తులను కాపాడుకోవచ్చు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments