చందానగర్ పిజేఆర్ స్టేడియం లో జాతిపిత మహాత్మా గాంధీ విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించి వినతి పత్రం సమర్పించిన రంగారెడ్డి జిల్లా జర్నలిస్టులు.
రంగారెడ్డి జిల్లా అధ్యక్షులు ఎండీ సలీమ్ పాషా అధ్యక్షతన, శేరిలింగంపల్లి ప్రెస్ క్లబ్ అధ్యక్షులు కొండా విజయ్ కుమార్ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా పాల్గొన్న రాష్ట్ర కార్యదర్శి కొంపల్లి శ్రీకాంత్ రెడ్డి
రక్షణ చట్టాలు,నూతన మీడియా కమిషన్ ఏర్పాటు, హక్కుల పునరుద్దరణ, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఎన్నికల్లో ఇచ్చిన హామీల అమలు కోరుతూ గౌరవ రాష్టపతి గారికి లేఖ
అక్రిడిటేషన్,హెల్త్ కార్డులు,ఇళ్ల స్థలాలు, ఇన్సూరెన్స్,దాడుల నిరోధక కమిటీలు వేయాలని ప్రభుత్వానికి డిమాండ్
శేరిలింగంపల్లి : టీయూడబ్ల్యూజే (ఐజేయూ) ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా నిర్వహిస్తున్న వర్కింగ్ జర్నలిస్ట్ ల డిమాండ్స్ డే సందర్భంగా రంగారెడ్డి జిల్లాలోని శేరిలింగంపల్లి నియోజకవర్గంపీజేఆర్ స్టేడియంలో కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు.రంగారెడ్డి జిల్లా యూనిట్- శేరిలింగంపల్లి ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు కొండ విజయకుమార్ సంయుక్త ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమానికి ఐజేయూ రాష్ట్ర కార్యదర్శి శ్రీకాంత్ రెడ్డి, రంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు సలీమ్ పాషా, జిల్లా కార్యదర్శి మేకల సత్యనారాయణ ముఖ్యఅతిథులుగా హాజరయ్యారు.ఈ సందర్భంగా గాంధీజీ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.అంతకుముందు జర్నలిస్టుల సమస్యలపై నేతలు మాట్లాడారు, టీయూడబ్ల్యూజే రాష్ట్ర కార్యదర్శి కొంపల్లి శ్రీకాంత్ రెడ్డి, జిల్లా అధ్యక్షులు ఎండీ సలీమ్ పాషా, కార్యదర్శి మేకల సత్యనారాయణ లు మాట్లాడుతూ జర్నలిస్టులపై జరుగుతున్న దాడులను ఖండిస్తూ, అక్రిడిటేషన్ కార్డులు,బస్ పాసులు, హెల్త్ కార్డులు, ఇన్సూరెన్స్, జర్నలిస్టుల ఇళ్ల స్థలాల సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేశారు.జర్నలిస్టుల సంక్షేమానికి ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపట్టాలని, విధి నిర్వహణలో ఎదురవుతున్న సమస్యలను పరిష్కరించి రక్షణ కల్పించాలని నాయకులు కోరారు.పనిచేసే జర్నలిస్ట్ లకు సంబందించిన సమస్యలపై ప్రభుత్వం వెంటనే స్పందించి,పెండింగ్ సమస్యలను త్వరితగతిన పరిష్కరించి జర్నలిస్టులకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు.ఈ కార్యక్రమం లో ఈ కార్యక్రమంలో మాజీ ఉమ్మడి జిల్లా అధ్యక్షులు ఆనంతుల శ్రీనివాస్, జిల్లా ఉపాధ్యక్షులు మాధవ్ రెడ్డి,ఏ భీమన్న, భాస్కర్, పాండు యాదవ్,సంయుక్త కార్యదర్శులు సత్యనారాయణ,సూర్య నారాయణ,ఆంజనేయులు, జిల్లా ఎలక్ట్రానిక్ మీడియా ప్రధాన కార్యదర్శి ఎం శ్రీనివాస్, ఉపాధ్యక్షులు దర్పల్లి రవీందర్, నరసింహ రావు, కార్యదర్శి ఎండీ షకీల్,ఈసీ సభ్యులు దర్శనం జంగయ్య, ఇలియాజ్, ప్రణయ్ ముదిరాజ్, శేఖర్, కరుణాకర్, కృష్ణ,చేవెళ్ల నియోజకవర్గ అధ్యక్షులు యాదయ్య, షాద్ నగర్ నియోజకవర్గ ఎలాక్ట్రానిక్ మీడియా అధ్యక్షులు నర్సింహా,శేరిలింగంపల్లి నియోజకవర్గ యూనియన్ నేతలు నాగేష్, నరేష్, గోవర్ధన్ రెడ్డి, మల్లేష్, శంకర్, నాగారత్నం,ప్రభాకర్ మహేందర్,భూమేష్, మహేందర్,యాసీన్,ఫారుఖ్, ఖాజా, బస్వారాజ్, షారఫాద్దీన్,సతీష్,
ఎలాక్ట్రానిక్ మీడియా కార్యదర్శి విజయ్,ప్రవీణ్, షఫీ,కలెక్టరెట్ రిపోర్టర్లు శ్రీనివాస్, మహేందర్,
జిల్లాలోని వివిధ ప్రెస్ క్లబ్ ల అధ్యక్షులు మహిపాల్ రెడ్డి, శ్రీనివాస్ గౌడ్,దామోదర్ రెడ్డి,రవీందర్, మల్లికార్జున్, జగన్, రాము యాదవ్,
జిలానీ, జయంత్, మనోహర్,రమేష్,భాస్కర్, విష్ణు, మల్లికార్జున్,షాద్ నగర్, ఇబ్రహీంపట్నం, మహేశ్వరం, చేవెళ్ల, రాజేంద్ర నగర్, ఎల్ బీ నగర్, మహేశ్వరం నియోజకవర్గాలకు చెందిన జర్నలిస్టులో పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.



