Tuesday, November 3, 2026
Google search engine
Homeతెలంగాణమహా పాదయాత్ర విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికీ హృదయపూర్వక ధన్యవాదాలు – ఎర్ర వినోద్ రెడ్డి

మహా పాదయాత్ర విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికీ హృదయపూర్వక ధన్యవాదాలు – ఎర్ర వినోద్ రెడ్డి

హైదరాబాద్:

కేంద్ర హోంమంత్రి గౌరవనీయులు శ్రీ అమిత్ షా గారు కాంగ్రెస్ పార్టీ వైఫల్యాలను, ప్రజా వ్యతిరేక విధానాలను ఎండగడుతూ తెలంగాణ రాజధాని హైదరాబాద్‌లోని ఎల్.బి. స్టేడియం నుండి మొజంజాహి మార్కెట్ వరకు చేపట్టిన మహా పాదయాత్ర కార్యక్రమంలో బీజేపీ GSI డివిజన్ (46) తరఫున పెద్ద సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికీ డివిజన్ అధ్యక్షులు ఎర్ర వినోద్ రెడ్డి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేశారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, మహా పాదయాత్రలో బీజేపీ మహిళా నాయకులు, కార్యకర్తలు, వివిధ అసోసియేషన్ల ప్రతినిధులు, పెద్దలు, బీజేపీ అభిమానులు, నాయకులు మరియు పార్టీలో వివిధ హోదాల్లో బాధ్యతలు నిర్వహిస్తున్న నాయకులు చూపిన ఉత్సాహం, ఐక్యత, క్రమశిక్షణ, అంకితభావం అభినందనీయమని పేర్కొన్నారు.

ప్రతి ఒక్కరూ తమ విలువైన సమయాన్ని కేటాయించి, ఎంతో ఉత్సాహంతో ఈ కార్యక్రమంలో భాగస్వాములై విజయవంతం చేయడం పట్ల ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. కార్యకర్తలే పార్టీకి బలమని, నాయకులు, కార్యకర్తలు, అభిమానుల సమష్టి కృషితోనే పార్టీ మరింత బలోపేతం అవుతుందని అన్నారు.

భవిష్యత్తులో కూడా ఇదే ఐక్యత, ఉత్సాహం, పట్టుదలతో ప్రజా సమస్యల పరిష్కారం కోసం, పార్టీ సిద్ధాంతాల ప్రచారం కోసం, ప్రజా సేవలో ప్రతి ఒక్కరూ కలిసికట్టుగా ముందుకు సాగాలని ఆయన పిలుపునిచ్చారు.

ఈ మహా పాదయాత్రను విజయవంతం చేయడానికి సహకరించిన ప్రతి ఒక్కరికీ మరోసారి పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు మరియు కృతజ్ఞతలు తెలియజేశారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments