Tuesday, November 3, 2026
Google search engine
Homeతెలంగాణఘనంగా అభ్యాస ఉమెన్స్ డిగ్రీ కాలేజ్ ఫేర్‌వెల్, గ్రాడ్యుయేషన్ వేడుకలు

ఘనంగా అభ్యాస ఉమెన్స్ డిగ్రీ కాలేజ్ ఫేర్‌వెల్, గ్రాడ్యుయేషన్ వేడుకలు

హైదరాబాద్

వనస్థలిపురం: హయత్‌నగర్‌ లోని ప్రముఖ విద్యాసంస్థ అభ్యాస మహిళా డిగ్రీ కళాశాల ఫేర్‌వెల్ పార్టీ, గ్రాడ్యుయేషన్ డే వేడుకలు ఎంఈ రెడ్డి గార్డెన్స్ ఫంక్షన్ హాల్ లో సోమవారం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఉస్మానియా విశ్వవిద్యాలయ కామర్స్ ప్రొఫెసర్ డాక్టర్ ఎ. పాట్రిక్ ఆంథోనీ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు.కార్యక్రమంలో భాగంగా ముఖ్యఅతిథి, ప్రిన్సిపాల్, డైరెక్టర్లు జ్యోతి ప్రజ్వలన చేసి వేడుకలను లాంఛనంగా ప్రారంభించారు. ముఖ్యఅతిథి ప్రొఫెసర్ డాక్టర్ పాట్రిక్ ఆంథోనీ మాట్లాడుతూ… మహిళా విద్యాభివృద్ధే సమాజ సమగ్ర వికాసానికి పునాది అని స్పష్టం చేశారు. పట్టభద్రులైన విద్యార్థినులు ఇక్కడితో ఆగిపోకుండా ఉన్నత చదువులు, పరిశోధనలు, పోటీ పరీక్షల వైపు దృష్టి సారించాలని సూచించారు. ఆధునిక సాంకేతికత, పోటీ నైపుణ్యాలను నిరంతరం అందిపుచ్చుకుంటూ స్వశక్తితో సమాజంలో ఉన్నత శిఖరాలను అధిరోహించాలని కోరారు.

నైతిక విలువలతో కూడిన నాణ్యమైన విద్యను అందించడమే ప్రధాన లక్ష్యం: ప్రిన్సిపాల్ డాక్టర్ మహేందర్

ఈ సందర్భంగా కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ మహేందర్ పవిరాల మాట్లాడుతూ… విద్యార్థినులకు కేవలం పుస్తక పరిజ్ఞానమే కాకుండా, నైతిక విలువలతో కూడిన సమగ్ర నాణ్యమైన విద్యను అందించడమే అభ్యాస మహిళా డిగ్రీ కళాశాల ప్రధాన లక్ష్యమని పేర్కొన్నారు. సమాజంలో మహిళలు ఆర్థికంగా, సామాజికంగా స్వయం సాధికారత సాధించేలా తమ కళాశాలలో అనుభవజ్ఞులైన అధ్యాపక బృందంతో విశేష శిక్షణ ఇస్తున్నామని తెలిపారు. అత్యాధునిక ల్యాబ్‌లు, లైబ్రరీ సౌకర్యాలతో పాటు నాయకత్వ లక్షణాలు, కమ్యూనికేషన్ స్కిల్స్ పెంపొందించేందుకు నిరంతరం తోడ్పాటునందిస్తున్నామని చెప్పారు. ఇక్కడి నుంచి వెళ్లే ప్రతి విద్యార్థిని సమాజంలో ఉన్నత స్థానాల్లో నిలబడి కళాశాలకు, తల్లిదండ్రులకు పేరు ప్రఖ్యాతలు తీసుకురావాలని ఆకాంక్షించారు.

ఆకట్టుకున్న సాంస్కృతిక ప్రదర్శనలు:

అనంతరం విద్యార్థినులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. సాంప్రదాయ క్లాసికల్ నృత్యాలతో ప్రారంభించి, తెలంగాణ జానపద గీతాలు, దేశభక్తి గీతాలు, సినీ గీతాలకు విద్యార్థినులు చేసిన నృత్య ప్రదర్శనలు ఆహుతులను ఎంతగానో అలరించాయి. విద్యార్థినుల ఫ్యాషన్ వాక్, బృంద నృత్యాలు, నాటికలు ప్రాంగణంలో సందడి నెలకొల్పగా, తోటి విద్యార్థుల ఈలలు, చప్పట్లతో సభా ప్రాంగణం మార్మోగింది. ఈ కార్యక్రమంలో కళాశాల డైరెక్టర్లు కె. మల్లేష్, బి. శ్యాంసుందర్ రెడ్డి, ఎల్. సునీత, అధ్యాపకులు లవకుమార్, ఇబ్రహీం, రాజేష్, స్రవంతి, అశ్విని, బిందు, దివ్య, సునిత, చందన, శ్రీనివాస్ మరియు విద్యార్థినులు, వారి తల్లిదండ్రులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments