Wednesday, November 11, 2026
Google search engine
Homeతెలంగాణమహిళలు, చిన్నారుల రక్షణకు భరోసా...

మహిళలు, చిన్నారుల రక్షణకు భరోసా…

  • గచ్చిబౌలిలో భరోసా సెంటర్ ప్రారంభం….
  • శేర్లింగంపల్లి నియోజకవర్గ ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ,
  • తెలంగాణ రాష్ట్ర డిజిపి సిబి ఆనంద్.

శేరిలింగంపల్లి:

గచ్చిబౌలి లోని సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ ప్రాంగణంలో నూతనంగా ఏర్పాటు చేసిన భరోసా సేంటర్ను రాష్ట్ర డిజిపి సివి.అనంద్, సైబరాబాద్ కమిషనరేట్ సిపి డాక్టర్ రమేష్, సిఎంసీ కమిషనర్ సృజనల తో కలిసి పాల్గొని ప్రారంభించిన పిఎసి చైర్మన్, శేర్లింగంపల్లి నియోజకవర్గం ఎమ్మెల్యే ఆరెకపూడి గాంధీ .

ఈ సందర్భంగా పిఎసి చైర్మన్, లింగంపల్లి నియోజకవర్గ ఎమ్మెల్యే గాంధీ మాట్లాడుతూ మహిళలు, చిన్నారుల రక్షణ కోసం ఏర్పాటు చేసిన ‘భరోసా కేంద్రం ను ఏర్పాటు చేసుకోవడం చాలా సంతోషకరమైన విషయం అని, ఎంతో మంది మహిళలకు ,చిన్నారుల రక్షణ కొరకు ఉపయోగపడుతుంది అని, పోలీసు ల సేవలు అమోఘం అని, శాంతి భద్రతలు కాపాడటంతో పాటు వారికి రక్షణ గా నిలబడుతూ వారికి న్యాయం అందేలా భరోసా చేయూత నిస్తుంది అని తెలియచేశారు.ముఖ్యంగా మైనర్ బాలికలు సాధారణ పోలీస్ స్టేషన్లు లేదా బహిరంగ కోర్టు ప్రాంగణాలకు వెళ్లినప్పుడు భయాందోళనలతో జరిగిన విషయాన్ని చెప్పలేకపోతారని గుర్తుచేశారు..అటువంటి వారి కోసం భరోసా కేంద్రాల్లో ప్రత్యేక నిపుణులతో కౌన్సెలింగ్, వైద్య పరీక్షలు, న్యాయ సహాయం (ప్రాసిక్యూషన్) అన్నీ ఒకే భవనంలో కల్పించడం వలన వారికి కొండత అండగా నిలవడం లో ఎంతగానో తోడ్పడుతాయి అని, వారి జీవితాలలో వెలుగులు నింపినవారు అవుతామని తెలియచేశారు.

ఈ సందర్భంగా రాష్ట్ర డిజిపి సివి.అనంద్ గారు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో మహిళలు, చిన్నారుల రక్షణ కోసం ఏర్పాటు చేసిన ‘భరోసా కేంద్రాలు’ దేశానికే ఆదర్శంగా నిలుస్తున్నాయని, ఇది తెలంగాణ పోలీసు విభాగానికి గర్వకారణమని నూతన భరోసా సెంటర్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో వక్త పేర్కొన్నారు..దాదాపు పదేళ్ల క్రితం ప్రారంభమైన ‘భరోసా కేంద్రాలు’ దేశంలోనే అత్యంత విశిష్టమైనవని కొనియాడారు..అత్యాచార బాధితులు,ముఖ్యంగా మైనర్ బాలికలు సాధారణ పోలీస్ స్టేషన్లు లేదా బహిరంగ కోర్టు ప్రాంగణాలకు వెళ్లినప్పుడు భయాందోళనలతో జరిగిన విషయాన్ని చెప్పలేకపోతారని గుర్తుచేశారు..అటువంటి వారి కోసం భరోసా కేంద్రాల్లో ప్రత్యేక నిపుణులతో కౌన్సెలింగ్, వైద్య పరీక్షలు, న్యాయ సహాయం (ప్రాసిక్యూషన్) అన్నీ ఒకే భవనంలో కల్పిస్తున్నట్లు తెలిపారు..బాధితులకు తొలుత మానసిక ధైర్యాన్ని ఇచ్చి, స్నేహపూర్వక వాతావరణంలో వివరాలు సేకరించడం ద్వారా నేరస్థులకు త్వరితగతిన శిక్షలు (కన్విక్షన్లు) పడేలా చేయవచ్చని స్పష్టం చేశారు. హైదరాబాద్‌లోని భరోసా కేంద్రంలో ‘చైల్డ్ ఫ్రెండ్లీ కోర్టు’ కూడా ఒకే ప్రాంగణంలో పనిచేస్తుండటం వల్ల విచారణ వేగవంతం అవుతోందని వివరించారు..సమాజంలో మృగాల్లా ప్రవర్తించే నేరస్థుల వల్ల బాధితులయ్యే వారికి అండగా నిలవడంలో ఈ కేంద్రాల పాత్ర ఎంతో కీలకమని అన్నారు..

ఈ కార్యక్రమంలో పోలీస్ ఉన్నత అధికారులు తదితరులు పాల్గొన్నారు

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments