తెలంగాణ రక్షణ సేన గ్రేటర్ హైదరాబాద్ అధ్యక్షులు, శేరిలింగంపల్లి నియోజకవర్గ ఇంచార్జ్ వాసిలి చంద్రశేఖర్ ప్రసాద్…..
శేరిలింగంపల్లి:
శేరిలింగంపల్లి నియోజకవర్గంలోని మియాపూర్లో ఇటీవల సుప్రీంకోర్టు 100, 101 సర్వే నెంబర్లలో భూములను ప్రభుత్వ భూములుగా గుర్తించి తీర్పునిచ్చిన నేపథ్యంలో సదరు భూములను తెలంగాణ రక్షణ సేన పార్టీ గ్రేటర్ హైదరాబాద్, శేరిలింగంపల్లి నియోజకవర్గ ఇంచార్జ్ వాసిలి చంద్ర శేఖర్ ప్రసాద్ పార్టీ నాయకులతో కలిసి మంగళవారం పరిశీలించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ మియాపూర్ సర్వే నెంబర్ 100, 101లో గత 30 ఏళ్లుగా 15 వేల పేద, నిరుపేద కుటుంబాలకు చెందిన ప్రజలు నివాసముంటున్నరన్నారు.అయితే సుప్రీం కోర్ట్ తీర్పు నేపథ్యంలో ఈ ప్రాంతంలో ఉంటున్న వారు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారని ప్రభుత్వం వారికి ఎటువంటి ఇబ్బంది లేకుండా స్పష్టమైన ప్రకటన చేయాలని ఆయన డిమాండ్ చేశారు. అదేవిధంగా ఈ భూములను అర్హులైన తెలంగాణ ఉద్యమకారులకు తెలంగాణ ఉద్యమంలో ప్రాణత్యాగం చేసిన ఉద్యమకారులకు గ్రేటర్ పరిధిలో కనీస గృహవసతి లేని నిరుపేదలకు కేటాయించాలని డిమాండ్ చేశారు. క్షేత్రస్థాయిలో అధికారులు రాష్ట్ర ముఖ్యమంత్రి చేస్తున్న ప్రకటనలు ఇక్కడ నివాసితులను భయాందోళనకు గురిచేస్తున్నాయన్నారు. రంగారెడ్డి జిల్లా కలెక్టర్ ఇప్పటికే నివాసం ఉంటున్న వారి జోలికి వెళ్ళమని ఒక పక్కన ప్రకటిస్తున్న ముఖ్యమంత్రి ఖాళీగా ఉన్న భూముల తో పాటు మొత్తం 550 ఎకరాల భూములను విక్రయిస్తామంటూ ప్రకటించడం ఎవరి మాట నమ్మాలో అర్థం కాని పరిస్థితిలో నివాసితులు భయపడుతున్నారు అన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం ఈ అంశంపై స్పష్టమైన ప్రకటన చేయాలని కోరారు. ముఖ్యంగా కార్పొరేట్ సంస్థలకు ఇక్కడ భూములను కేటాయించవద్దని ఇవి ప్రభుత్వ భూములు కాదని ప్రజల ఆస్తి అని ఆయన అన్నారు. ఇక్కడ నివసిస్తున్న ఎంఏ నగర్, స్టాలిన్ నగర్, పిఎ నగర్, ప్రశాంత్ నగర్ నివాసితులకు అన్యాయం జరిగితే తెలంగాణ రక్షణ సేన పార్టీ రాష్ట్రవ్యాప్తంగా పేదల పక్షాన పెద్ద ఎత్తున ఉద్యమిస్తుందని హెచ్చరించారు. వెంటనే రాష్ట్ర ప్రభుత్వం దీని మీద స్పష్టమైన ప్రకటన చేయాలిలని ఇక్కడ నివసిస్తున్న నిరుపేదలకు గృహలను క్రమభద్దికరించాలని తెలంగాణ రక్షణ సేన పార్టీ తరపున డిమాండ్ చేస్తున్నమన్నారు. కార్యక్రమంలో తెలంగాణ రక్షణ సేన నాయకులు గూడ లావణ్య, విష్ణు చారీ , కుమార్ యాదవ్, సుజాత, ప్రవీణ్ బిజిలి, శ్రీనివాస్ నేత,సందీప్ రవికుమార్ తదితరులు పాల్గొన్నారు.


