నవంబర్
మల్కాజ్ గిరి మున్సిపల్ కార్పోరేషన్ పరిధిలోని ఆర్కేపురం డివిజన్, స్నేహపురి కాలనీలో నూతనంగా ఏర్పాటు చేసిన రాధమ్మాస్ హౌజ్ ఆఫ్ హ్యాండ్లూమ్స్ షోరూమ్ ప్రారంభోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన రంగారెడ్డి జిల్లా కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి చిలుక మధుర ఉపేందర్ రెడ్డి షోరూమ్‌ను లాంఛనంగా ప్రారంభించారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, భారతీయ సంస్కృతి, సంప్రదాయాలకు చేనేత వస్త్రాలు ప్రతీకలని, చేనేత రంగానికి ప్రోత్సాహం అందించడం ప్రతి ఒక్కరి బాధ్యత అని పేర్కొన్నారు. సంప్రదాయ చేనేత కళను ఆధునిక అభిరుచులకు అనుగుణంగా ప్రజలకు చేరువ చేయాలనే లక్ష్యంతో రాధమ్మాస్ హౌస్ ఆఫ్ హ్యాండ్లూమ్స్ ముందుకు రావడం అభినందనీయమన్నారు. చేనేత కార్మికులకు చేయూతనిస్తూ, మహిళలకు నాణ్యమైన చేనేత వస్త్రాలు, ఆకర్షణీయమైన చీరలను అందించాలనే సంస్థ యాజమాన్యం సంకల్పం ప్రశంసనీయమని అన్నారు. నూతనంగా ప్రారంభించిన ఈ వ్యాపారం దినదినాభివృద్ధి చెందుతూ మరింత ఉన్నత స్థాయికి చేరుకోవాలని ఆకాంక్షించారు.ఈ కార్యక్రమంలో రాధమ్మాస్ హౌస్ ఆఫ్ హ్యాండ్లూమ్స్ యజమానురాలు సింగిరెడ్డి మాధవి రెడ్డి కుటుంబ సభ్యులు, స్థానిక ప్రముఖులు, మిత్రులు, శ్రేయోభిలాషులు తదితరులు పెద్ద సంఖ్యలో పాల్గొని నిర్వాహకులకు శుభాకాంక్షలు తెలియజేశారు.



