వనస్థలిపురం:
వనస్థలిపురం డివిజన్ పరిధిలోని ప్రశాంత్ నగర్ కాలనీలో నివాసముంటున్న కాలనీవాసి వల్లభనేని బాలాజీనాథ్ తండ్రి రూపేంద్రనాథ్ పెద్దకర్మ కార్యక్రమం ఆదివారం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ఆల్ ఇండియా ప్రొఫెషనల్స్ కాంగ్రెస్ చైర్మన్, మాజీ ఎంపీ మధుయాష్కి గౌడ్ హాజరయ్యారు.
ఈ సందర్భంగా కార్యక్రమంలో పాల్గొన్న కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్‌తో కలిసి మధుయాష్కి గౌడ్, దివంగత రూపేంద్రనాథ్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం బాలాజీనాథ్ కుటుంబ సభ్యులను కలసి వారి గాఢ సానుభూతిని తెలిపారు. మరణం ప్రకృతి సహజమని, పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని ఆకాంక్షించారు.
ఈ కార్యక్రమంలో యాదగిరిగుట్ట దేవస్థానం ట్రస్ట్ బోర్డ్ సభ్యురాలు పోచబోయిన ఈశ్వరమ్మ యాదవ్, మాజీ కార్పొరేటర్ రాగుల వెంకటేశ్వర్ రెడ్డి, హైదరాబాద్ మార్కెట్ కమిటీ డైరెక్టర్ నేలపాటి రామారావు, టీపీసీసీ ప్రధాన కార్యదర్శి పృథ్వి చౌదరి, డివిజన్ల అధ్యక్షులు కొల్లూరి శ్రీనాథ్, పి.గణేష్ రెడ్డి, డీసీసీ ప్రధాన కార్యదర్శి స్వర్ణ మాధవి, ప్రతినిధి దాము మహేందర్ యాదవ్, ఉపాధ్యక్షులు బాలకృష్ణ యాదవ్ తదితరులు పాల్గొన్నారు.



