రాష్ట్ర రెడ్డి సంఘం అధ్యక్షుడు బద్దూరి వెంకటేశ్వర్ రెడ్డి హర్షం
ఎల్బీనగర్:
తెలంగాణ సమాజంలో రెడ్డి సామాజిక వర్గ సంక్షేమం, ఐక్యత కోసం నిరంతరం శ్రమిస్తు రాష్ట్రంలోని అన్ని రెడ్డి సంఘాలను ఏకం చేసే దిశగా ఏర్పడ్డ తెలంగాణ రెడ్డి సంఘానికి తమ సంపూర్ణ మద్దతును ప్రకటిస్తూ… రెడ్డి జాగృతి రాష్ట్ర అధ్యక్షులు గుజ్జా జగన్ మోహన్ రెడ్డి వారి మిత్రబృందంతో కలిసి తెలంగాణ రెడ్డి సంఘం రాష్ట్ర అధ్యక్షులు బద్దూరి వెంకటేశ్వర్ రెడ్డి ఆధ్వర్యంలో గురువారం అధికారికంగా తెలంగాణ రెడ్డి సంఘంలో చేరారు.ఈ సందర్భంగా రెడ్డి జాగృతి రాష్ట్ర అధ్యక్షులు మాట్లాడుతూ, రెడ్డి సామాజిక వర్గ హక్కుల సాధన, పేద రెడ్డి విద్యార్థులకు అండగా నిలవడం, సమాజ సేవలో తెలంగాణ రెడ్డి సంఘం పోషిస్తున్న పాత్ర అభినందనీయమన్నారు. విడివిడిగా ఉండటం కంటే, అందరం ఒకే తాటిపైకి వచ్చి ఒకే వేదిక ద్వారా పని చేస్తేనే మన సామాజిక వర్గానికి, భవిష్యత్తు తరాలకు మరింత మేలు జరుగుతుందనే ఉద్దేశంతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు వారు స్పష్టం చేశారు.తెలంగాణ రెడ్డి సంఘం ముఖ్య నాయకులు బొక్క భూపాల్ రెడ్డి, కొట్టం మధుసూదన్ రెడ్డి ముఖ్య నాయకులు తెలంగాణ రెడ్డి సంఘం రాష్ట్ర కార్యవర్గం ఈ చేరికను ఘనంగా స్వాగతించారు. రెడ్డి జాగృతి రాష్ట్ర అధ్యక్షులకు, కార్యవర్గ సభ్యులకు, వారి మిత్రబృందానికి శాలువాలు కప్పి సంఘంలోకి ఆహ్వానించారు. ఈ ఐక్యతతో తెలంగాణ వ్యాప్తంగా రెడ్డి సామాజిక వర్గ బలం మరింత పెరుగుతుందని, రాబోయే రోజుల్లో మరిన్ని సంక్షేమ కార్యక్రమాలను ఉమ్మడిగా ముందుకు తీసుకెళ్తామని సంఘ ప్రతినిధులు పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో తెలంగాణ రెడ్డి సంఘం ముఖ్య కార్యవర్గ ప్రతినిధులు, మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.


