- దుబ్బాక బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు పాతూరి వెంకటస్వామి గౌడ్
- ఘనంగా రైతు వారోత్సవాలు
సిద్దిపేట:
సిద్దిపేట జిల్లా దుబ్బాక మండలంలోని అక్బర్‌పేట్ భూంపల్లి మండలం పోతారెడ్డిపేట రైతు వేదికలో ప్రజాపాలన–ప్రగతి ప్రణాళికలో భాగంగా రైతు వారోత్సవాలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి దుబ్బాక బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు పాతూరి వెంకటస్వామి గౌడ్ హాజరయ్యారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం రైతుల సంక్షేమాన్ని ప్రధాన లక్ష్యంగా తీసుకుని అనేక పథకాలను అమలు చేస్తోందన్నారు. రైతుల ఆర్థిక స్థితి మెరుగుపర్చేందుకు రూ.2 లక్షల రుణమాఫీ, సన్న వడ్లకు రూ.500 బోనస్, రైతు భరోసా, ఉచిత విద్యుత్, పంటలకు మద్దతు ధరలు వంటి కార్యక్రమాలు అమలులో ఉన్నాయని వివరించారు.రైతు వేదికలు రైతుల సమస్యల పరిష్కారానికి కీలకమని, ప్రభుత్వం తీసుకొస్తున్న ప్రతి పథకం రైతు సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకుని రూపొందించబడిందని పేర్కొన్నారు. కార్యక్రమంలో సర్పంచ్ మౌనిక, ఉప సర్పంచులు దమ్ముగౌని ప్రవీణ్, జీడిపల్లి రమేష్, ఆత్మ కమిటీ డైరెక్టర్ సతీష్, ఏఈఓ అనూష, కూడెల్లి డైరెక్టర్ పుదోజి ప్రభాకర్ చారి, ప్రదీప్ రెడ్డి, బండారి ఆశా గౌడ్, పేరూడి దయాకర్ రెడ్డి, కోరంధ రవీందర్ రెడ్డి, ఎర్రోళ్ల రాజు, వార్డు సభ్యులు, ఐకెపి సిబ్బంది మరియు రైతులు పాల్గొన్నారు.


