‘రెడీ టూ సర్వ్’ ఆశ్రమంలో పండ్లు, నిత్యావసర సరుకులు పంపిణీ చేసిన బిఆర్ఎస్ నేత శివ ప్రకాష్
*హైదరాబాద్:
ఎల్బీనగర్ శాసనసభ్యుడు దేవిరెడ్డి సుధీర్ రెడ్డి జన్మదినాన్ని పురస్కరించుకుని వనస్థలిపురంలోని ‘రెడీ టూ సర్వ్’ ఉచిత వృద్ధాశ్రమంలో సేవా కార్యక్రమాలు ఘనంగా నిర్వహించారు. బిఆర్ఎస్ నాయకుడు శివ ప్రకాష్ ఆధ్వర్యంలో ఆశ్రమంలోని వృద్ధులకు పండ్లు, నిత్యావసర సరుకులు మరియు దుప్పట్లను అందజేశారు.
ఈ సందర్భంగా శివ ప్రకాష్ మాట్లాడుతూ.. ఎల్బీనగర్ నియోజకవర్గ సంక్షేమం, అభివృద్ధి కోసం నిరంతరం శ్రమిస్తున్న ప్రజాప్రతినిధి సుధీర్ రెడ్డి ఆయురారోగ్యాలతో, ఆయురైశ్వర్యాలతో నిండు నూరేళ్లు జీవించాలని ఆకాంక్షించారు.
ఆశ్రమ వ్యవస్థాపకుడు పెద్ది శంకర్ మాట్లాడుతూ.. సుధీర్ రెడ్డికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. ఆశ్రమ వాసుల మధ్య ఇలాంటి సేవా కార్యక్రమాలు నిర్వహించిన శివ ప్రకాష్ మరియు వారి కుటుంబ సభ్యులకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.
ఈ కార్యక్రమంలో ఆశ్రమ నిర్వాహకులు పెద్ది శంకర్, అజయ్ కుమార్, సాయి యాదవ్, కళ్యాణ్, సూర్య, ప్రవీణ్, నరేష్, టోనీ, మహేష్ తదితరులు పాల్గొన్నారు.


