పిఎసి చైర్మన్, శేరిలింగంపల్లి నియోజకవర్గం ఎమ్మెల్యే అరెకపూడి గాంధీ.
శేరిలింగంపల్లి: శేర్లింగంపల్లి నియోజకవర్గంలో నెలకొన్న సమస్యలపై చేపట్టవలసిన పాలు పనులపై సిఎంసి కమిషనర్‌తో సమీక్ష సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే గాంధీ మాట్లాడుతూ శేరిలింగంపల్లి నియోజకవర్గంలో నిత్యం ట్రాఫిక్ రద్దీ తో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు అని, ట్రాఫిక్ కష్టాల నుండి గట్టెక్కించే విధంగా అన్ని రకాల చర్యలు తీసుకోవాలని, ప్రత్యామ్నాయ రహదారుల పై ప్రత్యేక శ్రద్ధ పెట్టేలా అధికారులకు సూచనలు ఇవ్వాలని, ట్రాఫిక్ రహిత సమాజం కోసం రోడ్ల విస్తరణ పనులు చేపట్టాలని, లింక్ రోడ్ల ను ఏర్పాటు చేయాలని తెలియచేశారు.
మసీదు బండ రోడ్డు, తారా నగర్ రోడ్డు, శ్రీదేవి థియేటర్ రోడ్డు, మియాపూర్ చౌరస్తా రోడ్డు, అంజయ్య నగర్ రోడ్డు, కాజగూడ రోడ్డు, ఐఐఐ టీ రోడ్డు విస్తరణ పనులలో వేగం పెంచాలని , అసంపూర్తిగా మిగిలిపోయిన రోడ్ల ను త్వరితగతిన రోడ్డు విస్తరణ పనులు చేపట్టాలని , రోడ్డు విస్తరణలో స్థలాలు, భవనాలు కోల్పోతున్నవారికి సముచిత న్యాయం చేయాలని,వారి జీవనాధారం కోల్పోవడం జరుగుతుంది కావున అందరికీ సమ న్యాయం చేయాలని, టీడీఆర్ ప్రక్రియ ను వేగవంతం చేయాలని, అదేవిధంగా అంజయ్య నగర్ రోడ్డు విస్తరణ పనులు త్వరితగతిన పూర్తి చేయాలని, తారా నగర్ రోడ్డు విస్తరణ పనులు వేగం పెంచాలని , ప్రజలకు ట్రాఫిక్ కష్టాలు గట్టెక్కెల చూడాలని,రోడ్డు విస్తరణ పనులలో వేగం పెంచాలని, అధికారులకు త్వరితగతిన పూర్తి చేయాలని ఆదేశాలు ఇవ్వాలని, టౌన్ ప్లానింగ్, సిఎంసీ ఇంజనీరింగ్ విభాగం అధికారులు సమన్వయంతో పనిచేసేలా చూడాలని కమిషనర్ గారిని కోరడం జరిగిందన్నారు.
గంగారం చెరువు నుండి జాతీయ రహదారి (ఎన్ హెచ్ -65) అపర్ణ హిల్ పార్క్ వరకు లింక్ రోడ్డు టెండర్ పూర్తి అయినది అని, సంబంధిత పనులు త్వరితగతిన పూర్తి చేసేలా చర్యలు తీసుకునేలా అధికారులకు ఆదేశాలు ఇవ్వాలని కమిషనర్ని కోరడం జరిగినది. ఈ లింక్ రోడ్డు వలన ప్రజలకు ఎంతో సాంత్వన చేకూరునని, ట్రాఫిక్ సమయం తగ్గి, ఇంధనం ఆదా అవుతుందాన్నారు.
అదేవిదంగా ఆల్విన్ కాలనీ లోని పైప్ లైన్ రోడ్డు లో పాత బ్రిడ్జి స్థానంలో కొత్త బ్రిడ్జి నిర్మించాలని, ప్రతిపాదనలు సిద్ధం చేయాలని, నాలా పై బ్రిడ్జి నిర్మాణం వలన రాకపోకలకు సులభతరం అవుతుందన్నారు.
చందానగర్ ప్రధాన రహదారి, హైదర్ నగర్, మియాపూర్ బొల్లారం రోడ్డు లో, వివేకానంద నగర్ బాగ్ అమీర్ కాలనీ జాతీయ రహదారి నిత్యం వేలాది వాహనాలతో రద్దీగా ఉండే రోడ్డు అని, ప్రమాదాలు జరుగునని, పాదచారులకు రోడ్డు దాటడం కష్టంగా ఉండునని, ప్రజలు రోడ్డు దాటే సమయంలో చాలా ఇబ్బందులకు గురి అవుతున్నారు అని, ప్రమాదాల బారిన పడుతున్నారు అని, పరిసర ప్రాంత ప్రజలకు ఈ ఫుట్ ఓవర్ బ్రిడ్జి లు ఎంతగానో ఉపయోగపడుతాయి అని, పాదచారులు సురక్షితంగా రోడ్డు దాటడానికి అన్ని హంగులతో సకల సౌకర్యాలతో ఫుట్ ఓవర్ బ్రిడ్జిల నిర్మాణం పనులను త్వరితగతిన పూర్తి చేసి ప్రజలకు త్వరలోనే అందుబాటులోకి తీసుకువచ్చేల చర్యలు తీసుకోవాలన్నారు.
ఫుట్ ఓవర్ బ్రిడ్జి నిర్మాణం వలన వాహనాల రాకపోకలకు ఎలాంటి ఆటంకం కలగకుండా ప్రజలకు రక్షణ కల్పిస్తుంది అని, వేగంగా వెళ్లే వాహనాల మధ్య రోడ్డు దాటే ప్రమాదాలను తగ్గిస్తుంది అని, జనాల రాకపోకల వల్ల రోడ్లపై ఏర్పడే ట్రాఫిక్ జామ్‌లను తగ్గిస్తుంది.అని , వృద్ధులు, దివ్యాంగుల కోసం మెట్లతో పాటు లిఫ్ట్‌లు లేదా రాంప్‌లను కూడా ఏర్పాటు చేయడం జరుగుతుందన్నారు.
అదేవిధంగా శేరిలింగంపల్లి నియోజకవర్గంలో పెండింగ్ లో ఉన్న రోడ్ల పనులు త్వరితగతిన పూర్తి చేయాలని, అసంపూర్తిగా మిగిలిపోయిన నాలా విస్తరణ పనులను త్వరితగతిన పూర్తి చేయాలని, చెరువుల సుందరీకరణ పనులు చేపట్టాలని, పార్కులను అభివృధి చేయాలని, అన్ని శాఖల అధికారులు అప్రమత్తంగా ఉండేలా ప్రజలకు అందుబాటులో ఉండేందుకు వీలుగా, సమన్వయం తో పనిచేసేలా ఆదేశాలు ఇవ్వాలని కమిషనర్ దృష్టికి తీసుకువెళ్లడం జరిగినదన్నారు.
ఈ సందర్భంగా కమిషనర్ సృజన మాట్లాడుతూ పైన పేర్కొన్న అంశాల పై సానుకూలంగా స్పందించడం జరిగినది.
ఈ కార్యక్రమంలో టౌన్ ప్లానింగ్ సీసీపీ వెంకన్న, ప్రాజెక్ట్స్ సిఈ శ్రీ లక్ష్మీ, ఈఈ గోపాల్,సిఎంసీ ఎస్ఈ శ్రీకాంతిని, ల్యాండ్ అక్వైజేషన్ ఆఫీసర్ అరుణమ్మ తదితరులు పాల్గొన్నారు.



