ఎల్బీనగర్:
బోనాల పండుగ సందర్భంగా ఆర్కేపురం మూడు గుళ్ళ ఉత్సవ కమిటీ అధ్యక్షులు పున్న గణేష్ నేత ప్రధాన కార్యదర్శి బండి మధుసూదన్ రావు ఆధ్వర్యంలో ఘనంగా ఊరేగింపు ఆదివారం రాత్రి నిర్వహించారు. గత 16 సంవత్సరాలుగా నిర్వహిస్తున్న శ్రీశ్రీశ్రీ మైసమ్మ అమ్మవారి పలహార బండి (మూడు గుళ్ళు) పోచమ్మ, ఎల్లమ్మ, మైసమ్మ గుడి నుండి ఎన్టీఆర్ నగర్ శ్రీ ఖిల్లా మైసమ్మ ఆలయం వరకు ఊరేగింపు కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిలుగా బీసీ కమిషన్ సభ్యులు రాపోలు జయప్రకాష్, మహేశ్వర నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు టీపీసీసీ సభ్యులు దేప భాస్కర్ రెడ్డి మాజీ జిహెచ్ఎంసి డిప్యూటీ ఫ్లోర్ లీడర్ రామకృష్ణాపురం డివిజన్ మాజీ కార్పొరేటర్ సురేఖ భాస్కర్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా దేప భాస్కర్ రెడ్డి ఉత్సవ కమిటీ అధ్యక్షులు పున్న గణేష్ నేత మాట్లాడుతూ, తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలకు చిహ్నంగా నిలిచే బోనాల పండుగ భక్తులు అత్యంత భక్తిశ్రద్ధలతో జరుపుకుంటారని అన్నారు. కొత్తపేట ప్రాంతంలో శ్రావణమాసంలో ప్రారంభమయ్యే బోనాల పండుగలో భాగంగా పలహార బండి, అమ్మవారి ప్రతిరూపం తొట్టెల, పోతరాజుల నృత్యాలతో వివిధ అమ్మ వార్ల వేషాలతో, ఘటాలతో జోగిని అనురాధ శివసత్తుల పూనకాలతో, భాజా భజంత్రీలతో విజయపురి కాలనీ మూడు గుళ్ళ నుండి మొదలై టెలిఫోన్ కాలనీ, సౌభాగ్యపురం, గ్రీన్ హిల్స్ కాలనీ మీదుగా శ్రీ ఖిల్లా మైసమ్మ వారి ఆలయం వరకు చేరుకొని పలహార బండి అమ్మవారి, తొట్టెల సమర్పించారని అన్నారు. ఈ కార్యక్రమానికి ఆర్కేపురం డివిజన్ లో ఉన్న అన్ని కాలనీల వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షులు కార్యదర్శులు కార్యవర్గ సభ్యులు మహిళలు అత్యధిక సంఖ్యలో భక్తులు పాల్గొని కొబ్బరికాయలు కొట్టి పలహర బండి ఊరేగింపు ప్రారంభించారు. ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో అతిథులను సన్మానించారు.
ఈ కార్యక్రమంలో శ్రీరామ కృష్ణాపురం డివిజన్ కాంగ్రెస్ పార్టీ కంటెస్టెడ్ కార్పొరేటర్ శ్రీమతి పున్న నిర్మల గణేష్ నేత రంగారెడ్డి జిల్లా ప్రధాన కార్యదర్శి చిలక ఉపేందర్ రెడ్డి రాష్ట్ర బీసీ నాయకులు గట్ల రవీంద్ర, శ్రీ ప్రసన్నాంజనేయ స్వామి దేవాలయం చైర్మన్ తలాటి రమేష్ నేత ఎన్టీఆర్ నగర్ డివిజన్ అధ్యక్షులు ముప్పిడి లింగస్వామి గౌడ్ డాక్టర్స్ కాలనీ డివిజన్ అధ్యక్షుడు నల్లంకి ధనరాజ్ గౌడ్ గడ్డి అన్నారం మార్కెట్ కమిటీ డైరెక్టర్ జిన్నం వెంకటేశ్వర్లు, లక్ష్మీ నగర్ ఎస్బిఐ కాలనీ, విజయపురి కాలనీ, సౌభాగ్యపురం, టెలిఫోన్ కాలనీ, ఎస్ఆర్కే కాలనీ, మార్గదర్శి కాలనీ, వాసవి కాలనీ, అల్కాపూర్ కాలనీలకు సంబంధించిన అధ్యక్షులు, ప్రధాన కార్యదర్శులు, కమిటీ సభ్యులు, మహిళలు, యువకులు పెద్ద ఎత్తున హాజరై ఊరేగింపు ఉత్సవ కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేశారు.


