ఎల్బీనగర్:
తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే బతుకమ్మ పండుగను శ్రీ షణ్ముఖ గ్లోబల్ ప్లే స్కూల్లో చిన్నారులతో ఘనంగా నిర్వహించారు.రంగురంగుల పూలతో బతుకమ్మలను పేర్చి, సంప్రదాయ దుస్తుల్లో ముస్తాబైన చిన్నారులు వేడుకల్లో ఉత్సాహంగా పాల్గొన్నారు. బతుకమ్మ పాటలు, ఆటలతో పాఠశాల ప్రాంగణం సందడిగా మారింది.చిన్నారులకు చిన్నతనం నుంచే తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలపై అవగాహన కల్పించాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. పండుగల విశిష్టతను పిల్లలకు తెలియజేస్తూ, మన సంస్కృతి పట్ల ఆసక్తిని పెంపొందించేందుకు ఇలాంటి కార్యక్రమాలు దోహదపడతాయని పాఠశాల ప్రిన్సిపాల్ శ్రీవాణి, తెలిపారు. ఈ బతుకమ్మ సంబరాలలో చిన్నారుల తల్లిదండ్రులు పాల్గొన్నారు.


