Home తెలంగాణ సంకల్ప పార్కు అభివృద్ధికి సంపూర్ణ సహకారం..

సంకల్ప పార్కు అభివృద్ధికి సంపూర్ణ సహకారం..

0
3

పటాన్‌చెరు శాసన సభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి

రామచంద్రాపురం

భారతి నగర్ డివిజన్ పరిధిలోని ఓల్డ్ ఎంఐజిలో గల సంకల్ప్ పార్కు అభివృద్ధికి సంపూర్ణ సహకారం అందిస్తామని పటాన్‌చెరు శాసన సభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి తెలిపారు. ఆదివారం ఉదయం స్థానిక ప్రతినిధులు, కాలనీ సంక్షేమ సంఘం సభ్యులతో కలిసి పార్కును పరిశీలించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే జిఎంఆర్ మాట్లాడుతూ.. పార్కులో వాకింగ్ ట్రాక్, లైట్స్, క్రీడా సామాగ్రి, బాల్ బ్యాడ్మింటన్ కోర్టు ఏర్పాటు చేయబోతున్నట్లు తెలిపారు. అనంతరం ఎల్ఐజి సొసైటీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన బీహెచ్ఈఎల్ ఎల్ఐజి హౌజ్ బిల్డింగ్ కో ఆపరేటివ్ సొసైటీ లిమిటెడ్ గోల్డెన్ జూబ్లీ ఉత్సవాల్లో ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. కమిటీ సభ్యులను ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు ఆదర్శ్ రెడ్డి, ఐలేష్, రమణ, వెంకట్ రెడ్డి, యాదగిరి రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here