ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్ రెడ్డి డిమాండ్
ఎల్బీనగర్:
రంగారెడ్డి జిల్లా హయత్ నగర్ మండల పరిధిలోని అన్మగల్ ముదిరాజ్ కాలనీ పక్కన ఉన్న సర్వే నెంబర్ 255/1 లో మొత్తం 74 ఎకరాల 37 గుంటల స్థలం ఉంది.అందులో రైతులు 56 ఎకరాల భూమిని వారి అవసరాలకు గతంలోనే విక్రయించడం జరిగింది. ఇందులో మిగతా 18 ఎకరాల భూమి కొంతమంది కొంత భాగంలో రైతులు సాగు చేస్తుండగా, కొంత భాగం రైతులు తమ అవసరాల కోసం విక్రయించారు.ప్రస్తుతం స్థలం ఖాళీగా కనిపించడంతో ప్రభుత్వం లాక్కోవడానికి ప్రయత్నిస్తుందన్న నేపద్యంలో పలువురు రైతులు, ప్లాట్ల కొనుగోలుదారులు కొన్ని రోజుల క్రితం సుధీర్ రెడ్డిని కలిశారు.అందుకు సుధీర్ రెడ్డి అన్మగల్ గ్రామానికి చేరుకొని బాధిత రైతులు, కొనుగోలుదారులతో మాట్లాడారు. ప్రభుత్వంతో కొట్లాడైన సమస్య పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు.భారాస పార్టీ ప్రభుత్వ హయంలో ఇక్కడి రైతుల విషయంలో ప్రభుత్వంతో మాట్లాడి తగు న్యాయం చేయడం జరిగిందని గుర్తు చేశారు.ప్రస్తుతం రైతులకు ఎలాంటి చట్టపరమైన హక్కులు లేకుండా ప్రభుత్వం ప్రయత్నం చేస్తుందని అన్నారు.పేదల హక్కులను పరిరక్షించడం ప్రభుత్వ బాధ్యత అని, బాధితులకు న్యాయం జరిగే వరకు తమ పోరాటం కొనసాగుతుందని సుధీర్ రెడ్డి స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో హయత్ నగర్ భారాస పార్టీ అధ్యక్షులు చెన్నగౌని శ్రీధర్ గౌడ్,మల్లీశ్వరి రెడ్డి, ప్రదీప్, మధు, ఇంద్ర కరణ్ రెడ్డి, మల్లేష్ రైతులు నగేష్, స్కైలాబ్, శ్రీరాములు, శ్యామ్,ప్రవీణ్, గంగాని శ్రీను తదితరులు పాల్గొన్నారు.


