సిద్దిపేట:
సిద్దిపేట జిల్లాలోని సీసీఎస్ విభాగంలో పనిచేస్తున్న కానిస్టేబుల్ ప్రవీణ్‌ను హత్య మరియు దొంగతనం కేసుల్లో అరెస్టు కావడంతో సస్పెండ్ చేస్తూ సిద్దిపేట పోలీస్ కమిషనర్ రష్మీ పెరుమాళ్ ఉత్తర్వులు జారీ చేశారు.పోలీస్ శాఖలో పనిచేస్తూ నేరాలు, చట్టవ్యతిరేక కార్యకలాపాలు లేదా అసాంఘిక చర్యల్లో పాల్గొనే వారిపై చట్టపరంగా మరియు శాఖాపరంగా కఠిన చర్యలు తీసుకుంటామని సీపీ హెచ్చరించారు.శాఖ ప్రతిష్టను దెబ్బతీసే విధంగా వ్యవహరించిన ఎవరినీ ఉపేక్షించబోమని, నిబంధనలు ఉల్లంఘించిన వారిపై కఠిన చర్యలు కొనసాగుతాయని పేర్కొన్నారు.


